కోటగిరి గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
అతను కృష్ణా జిల్లా, నూజివీడుకు చెందినవాడు. వీరి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెండ్రు. వీరి పూర్వీకులు జమీందారు దగ్గర దీవాన్లుగా పనిచేసేవారు. అందుకు వారికి ఆస్తులు ఎక్కువగా ఉండేవి. వారి ఊరికి ఎవరు వచ్చినా వారి ఇంటిలోనే భోజనం చేసేవారు. అందుకే వారి ఇల్లు అతిథులతో కళకళలాడుతూ ఉండేది. అతని నాన్నగారి హయాంలో ఇంటిలో రాజభోగం. అతనిది విలాసవంతమైన బాల్యం. హఠాత్తుగా తన తండ్రి మరణించడంతో కుటుంబ భాద్యత పెద్దకుమారుడైన గోపాలరావుపై పడింది. అతను కుటుంబ పోషణార్థం వ్యవసాయం చేద్దామనుకున్నాడు. శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు. కానీ ఏ పంటా కలసి రాలేదు. దాంతో ఏదైనా ఉద్యోగం చేద్దామని మద్రాసు వెళ్ళి జమీందారు గారిని కలిసాడు. జమీందారుకు ఎక్కడో ఒక స్టుడియో ఉండేది. దానిలో పని ఇప్పించాడు. అక్కడ అతను ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఆదుర్తి సుబ్బారావు వంటి వారి సినీమాలకు ఎడిటింగ్ చేస్తూండేవాడు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పాటు మరో 10 మంది దగ్గర ఎడిటర్‌గా మారారు.
 
మెట్రిక్యులేషన్ పూర్తయ్యాక వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేయకూడదనుకున్నారు. కానీ సోదరుడి బలవంతం కారణంగా, అతను మద్రాసులో తన సోదరుడితో చేరి సంపాదకుడిగా శిక్షణ పొందాడు. కె. రాఘవేంద్రరావు 1977 లో తన అడవి రాముడు సినిమాలో మూడు పాటలను ఎడిట్ చేసే అవకాశం ఇచ్చారు .
 
ఎన్‌టి రామారావు , బి. గోపాల్ , భారతీరాజా మరియు మరెన్నో దిగ్గజాల చిత్రాలకు ఆయన పనిచేశారు . ప్రముఖ దర్శకుడు కాకముందు, SS రాజమౌళి తన కస్టడీలో ఒక సంవత్సరం పాటు సినిమా ఎడిటింగ్స్‌లో శిక్షణ పొందారు.
 
ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై సభ్యులకు 6 సంవత్సరాలు సేవలందించారు.
 
అతను సుజాతను వివాహం చేసుకున్నాడు మరియు ఇద్దరు కుమార్తెలు (పద్మజ మరియు నీరజ) ఉన్నారు.
 
తన తమ్ముడు వెంకటేశ్వరరావుకు తన శిష్యుని వద్ద అప్రెంటిస్ గా చేర్చి ఎడిటింగ్ లో శిక్షణ యిప్పించాడు. కొన్నాళ్ల తరువాత అతనే ఎడిటింగ్ నేర్పించాడు. గోపాలరావు కె.రాఘవేంద్రరావు సినిమాలకు ఎక్కువగా ఎడిటింగ్ చేసేవాడు.
"https://te.wikipedia.org/wiki/కోటగిరి_గోపాలరావు" నుండి వెలికితీశారు