గిడుగు వేంకట సీతాపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు [[జనవరి 28]], [[1885]] సంవత్సరంలో [[విశాఖపట్నం]] జిల్లా [[భీమునిపట్నం]]లో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన [[గిడుగు వెంకట రామమూర్తి]] దంపతులకు జన్మించారు.
 
[[మద్రాసు క్రైస్తవ కళాశాల]]లో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం [[పర్లాకిమిడి]]లో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, [[సవర]] భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. [[రైతుబిడ్డ]], [[స్వర్గసీమ]], [[పల్నాటి యుద్ధం]], [[భక్తిమాల]] వంటి కొన్ని చలనచిత్రాలలోను మరియు కొన్ని నాటకాలలోను నటించారు.
 
1945లో [[మాగంటి బాపినీడు]] సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో [[తెలుగు భాషా సమితి]] ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు.