గడ్డం రాంరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
వీరు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో రాజకీయ శాస్త్రంలో పట్టా పొంది పి.హెచ్.డి. స్వీకరించారు. 1977 వరకు అక్కడే ప్రొఫెసర్ గా పనిచేశారు. 1977 నుండి 1982 మధ్య కాలంలో ఉపసంచాలకులుగా పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వీరు హైదరాబాదులోని భారత సమాజ విజ్ఞాన పరిశోధనా మండలి, దక్షిణ ప్రాంతీయ కేంద్రానికి వ్యవస్థాపక డైరెక్టర్ గా సమాజ శాస్త్రంలో పలు ప్రయోగాలు చేశారు.
 
1980 దశాబ్దంలో వీరు [[దూరవిద్య]] వైపు దృష్టి మళ్ళించి దానిపై విశేషాధ్యయనం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిచెందిన [[బ్రిటిష్ ఓపెన్ యూనివర్సిటీ]] గురించి నిశితంగా పరిశీలించారు. [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం కోరిక మేరకు సార్వత్రిక విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ప్రారంభించే విషయంలో ఒక నివేదిక సమర్పించారు. దీనిని ప్రభుత్వం ఆమోదించి 1982 లో దేశంలో మొట్టమొదటగా ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పడింది. దీనిని డాక్టర్ [[బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము]] గా నామకరణం చేశారు. దీనికి మొదటి వైస్ ఛాన్సలర్ గా వీరిని నియమించారు. వీరు ఈ విశ్వవిద్యాలయాన్ని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దారు. వీరి కృషిని గుర్తించి [[భారత ప్రభుత్వం]] 1985లో ప్రారంభించిన [[ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం]] వైస్ ఛాన్సలర్ గా నియమించింది. అక్కడ వారు చేసిన కృషి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. తరువాత 1991లో భారత ప్రభుత్వం వీరిని కొత్త ఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. ప్రపంచంలోని ప్రముఖ సార్వత్రిక విశ్వవిద్యాలయాలను పరిశీలించి సార్వత్రిక వ్యవస్థకు ఒక చక్కని నమూనా తయారుచేసి తొలిసారిగా [[ఆసియా అభివృద్ధి బ్యాంకు]] ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. ఈ నమూనా పలుదేశాలలో సార్వత్రిక విశ్వవిద్యాలువిశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోడానికి తోడ్పడింది.
 
దూరవిద్యా పితామహులైన రాంరెడ్డి గారు లండన్ లో [[జూలై 2]], [[1995]]లో పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/గడ్డం_రాంరెడ్డి" నుండి వెలికితీశారు