→‎ఫిన్లాండ్ బొమ్మలు: కొత్త విభాగం
పంక్తి 26:
 
:: వికీపీడియా అనేది స్వీయ, సృజనాత్మక రచనలు, అభిప్రాయాలు ప్రచురించే స్థలం కాదు. పూర్తి రచనల ప్రచురణా వేదిక కూడా కాదు. '''[[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు]]''' అన్న పేజీని ఒకమారు పరిశీలించండి. (1) ఉదాహరణకు [[మహాభారతం]] తీసికొనండి. మహాభారతాన్ని "గురించిన" వ్యాసం వికీపీడియాలో ఉండవచ్చును. మహాభారతం "పూర్తి పాఠం" వికీసోర్స్‌లో ఉండవచ్చును. (ఆంధ్ర మహాభారతం అనే బృహత్తరమైన ప్రాజెక్టు ద్వారా ఈ మహాకార్యాన్ని నిర్వహిస్తున్నారు) (2) మీ సాయిబాబా పాటలు మీ సృజనాత్మకమైన రచన. అంతే కాకుండా అందులో మీ అభిప్రాయాలు (భక్తి, ఛందస్సు వంటివి) మిళితమై ఉంటాయి. కనుక వాటిని వికీపీడియాలో ఉంచదగదు. ఇది మీ రచనలకు వంక పెట్టడం ఏమాత్రం కాదు. (3) [[వికీపీడియా:శైలి]] కూడా ఒకమారు చూడగలరు. (4) అన్నట్లు [[వెల్లూరు]] వ్యాసాన్ని మీరు బాగా అభివృద్ధి చేశారు. అభినందనలు. తరువాత వీలయినప్పుడు కొన్ని బొమ్మలు కూడా జోడించండి. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 18:26, 8 మార్చి 2008 (UTC)
 
== ఫిన్లాండ్ బొమ్మలు ==
 
మల్యాద్రి గారూ! మీరు ఫిన్లాండు గురించి కొన్ని బొమ్మలు అప్‌లోడ్ చేశారు. చాలా బాగున్నాయి. అవి మీరు తీసినవే అనుకొంటాను. కాని వాటికి ఏ విధమైన కాపీ హక్కుల ట్యాగులు ఇవ్వలేదు. దయచేసి గమనించండి.
 
* బొమ్మల గురించి కొంత సమాచారం (ఏ ప్రదేశం? అందులో ఏమనుంది?) ఇవ్వండి.
* బొమ్మలు మీరు స్వయంగా తీశారని వ్రాయండి. లేదా ఇతరులు తీసినవైతే వారి పేరు వ్రాయండి. వారు అనుమతి ఇచ్చారని కూడా (ఇస్తే గనుక) వ్రాయండి.
* వాటికి కాపీ హక్కుల ట్యాగులు జత పరచండి. ఉదాహరణకు '''<nowiki> {{GFDL-self}} {{cc-by-sa-2.5}} {{PD-self}}</nowiki> ''' వంటివి
 
ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో వ్రాయగలరు --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 07:37, 21 నవంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Malyadri" నుండి వెలికితీశారు