బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''బెంగుళూరు నాగరత్నమ్మ''' భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బెంగుళూరు నాగరత్నమ్మ''' (1878 -1952) భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారత దేశభారతదేశ కళలకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన కార్యములు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించింది.
 
==జననము==
 
మైసూరు దగ్గరలోని నంజనగూడు ఒక చిన్న గ్రామము. అచట నాగరత్నమ్మ 1898 నవంబరు 3వతేదీ పుట్టలక్ష్మమ్మ అను దేవదాసికి, సుబ్బారావు అను వకీలు కు జన్మించింది. ఒకటిన్నర సంవత్సరముల పిదప సుబ్బారావు తల్లీ బిడ్డలను వదిలివేశాడు. పుట్టలక్ష్మమ్మ ఎన్నోకష్టాలకు ఓర్చి, బాధలను సహించి పట్టుదలతో కూతురుని పెంచింది.
 
==బాల్యము, విద్య==
 
తల్లిప్రేమలో నాగరత్నమ్మ బాల్యము ఒడుదుడుకులు లేకుండా గడిచింది. గిరిభట్ట తమ్మయ్య అను గురువు వద్ద సంస్కృతము, వివిధ కళలు నేర్చుకుంది. వయసుకు మించిన తెలివితేటలవల్ల ప్రతివిషయమూ చాలా త్వరగా ఆకళింపు చేసుకొనేది. మాతృభాష కన్నడము, తెలుగు, తమిళము, ఆంగ్ల భాషలు నాగరత్నమ్మకు కొట్టిన పిండి. తొమ్మిది ఏండ్లకే గురువుని మించిన శిష్యురాలై గురువు అసూయకు గురైయింది. పుట్టలక్ష్మమ్మ కూతురిని గొప్ప విదుషీమణిగా తీర్చిదిద్దిన తరువాతే మైసూరుకు తిరిగివస్తానని ప్రతినపూని మద్రాసు (చెన్నయి) చేరింది. మంచి గురువు కోసం అన్వేషణలో కంచి, చివరకు బెంగళూరు చేరింది. అచట మునిస్వామప్ప అను వాయులీన విద్వాంసుడు నాగరత్నమ్మకు సంగీతము నేర్పుటకు అంగీకరించాడు. త్యాగరాజు శిష్యపరంపరలోని వాలాజాపేట వేంకటరమణ భాగవతార్, ఆతని కొడుకు కృష్ణస్వామి భాగవతార్ల శిష్యుడు మునిస్వామప్ప. ఈవిధముగా నాగరత్నమ్మ జీవితము త్యాగరాజస్వామి వారి సేవతో ముడిపడింది. కిట్టణ్ణ అను వానివద్ద నాట్యాభ్యాసము, తిరువేంగడాచారి వద్ద అభినయకౌశలము నేర్చుకుంది. తల్లి కనుసన్నలలో, గురువుల పర్యవేక్షణలో నాలుగు సంవత్సరాలు కఠోర శ్రమచేసి సంగీత నాట్యాలలో నిష్ణాతురాలయింది. పుట్టలక్ష్మమ్మ ఆనందానికి అవధులు లేవు. దురదృష్ఠవశాత్తు, నాగరత్నమ్మ పదునాలుగవ ఏట తల్లి మరణించింది.
 
==రంగ ప్రవేశము==
 
1892 వవరాత్రుల సమయములో మైసూరు మహారాజు కొలువులోని ఆస్థాన సంగీతకారుడు వీణ శేషణ్ణ ఇంటిలో నాగరత్నమ్మ చేసిన నాట్యము పలువురు కళాకారులను, సంగీతవిద్వాంసులను ఆకర్షించింది. ఆమె సంగీతములోని సంప్రదాయ శుద్ధత, సాహిత్యములోని మంచి ఉచ్చారణ, కంఠములోని మాధుర్యము, అందమైన కల్పన ఆ విద్వత్సదస్సులోని ప్రాజ్ఞులను ఆనందపరచింది. కచ్చేరి ముగిసిన పిదప ఆమె వినయవిధేయతలతో అందరికీ నమస్కారము చేసింది. అనతికాలములోనే మహారాజావారి కొలువులో సంగీత నాట్య కళాకారిణి స్థానములో కుదురుకున్నది. నాగరత్నమ్మ పేరుప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించాయి. తల్లి ప్రతిన నెరవేర్చింది.
 
==దిగ్విజయములు==
 
నాగరత్నమ్మ 25వ ఏట గురువు మునిస్వామప్ప మరణము ఆమె జీవితములో ఒక పెద్ద మలుపు. 1894 డిసెంబరులో మైసూరు నుండి మదరాసు చేరి రాజరత్న ముదలియార్ అను ధనికుని ప్రాపకము సంపాదించింది. ప్రఖ్యాత సంగీతకారులు నివసించు ప్రాంతములో ఇల్లు సంపాదించి ఉండసాగింది. అచట వీణ ధనమ్మాళ్ మంచి స్నేహితురాలయ్యింది. సంగీత సాధనకు పూచి శ్రీనివాస అయ్యంగారుల ప్రోత్సాహము దొరికింది. ఆమె ఇంటిలోని కచ్చేరీలకు, భజనల కార్యక్రమములకు చాల మంది సంగీత విద్వాంసులు వచ్చేవారు. నాగరత్నమ్మ దక్షిణ భారతమంతయూ దిగ్విజయముగా పర్యటించింది. ప్రతిచోటా కళాభిమానులు నీరాజనాలిచ్చారు. రాజమహేంద్రవరములో శ్రీపాద కృష్ణమూర్తి గారు తొడగిన గండపెండేరము ఆమె ప్రతిభకు తార్కాణము.
 
==త్యాగరాజ సేవ==
 
నాగరత్నమ్మకు ఒక కూతురుండేది. చిన్నవయసులోనే చనిపోయింది. పిల్లలపై మమకారముతో ఒక పిల్లను పెంచుకున్నది.
 
==సాహిత్య సేవ==
Line 17 ⟶ 27:
 
* బెజ్జాల కృష్ణమోహన రావు గారి వ్యాసము: http://eemaata.com/em/issues/200711/1166.html
* శ్రీరామ్ గారి పుస్తకము: The Devadasi and the Saint: The Life and Times of Bangalore Nagarathnamma, 2008, V. Sriram ISBN : 9788188661701