చెలికాని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''చెలికాని వెంకట రామారావు''' (Chelikani Ramarao) (1901-1985) 20 వ శతాబ్దపు భారతదేశ చరిత్రలోని ఉజ్వల అధ్యాయాలకు ప్రతీక. మానవీయత, నిజాయితీ, వినమ్రత స్పష్టత నిబద్ధతలనే తన విశిష్ట లక్షణాలతో ఆయన తన కాలంనాటి అన్ని అభ్యుదయ - వివేకానందుని బోధనలు, బ్రహ్మ సమాజ ఉద్యమం, [[రఘుపతి వెంకటరత్నం]] గారి శిష్యరికం, స్వాతంత్రయ పోరాటం, జైలు జీవితం, హరిజనసేవ, స్త్రీ జనోద్దరణ, కమ్యూనిస్టు ఉద్యమం, పార్లమెంటు సభ్యత్వం, వైద్యసేవ ఇత్యాది, ఉద్యమాల, ప్రభావాల కార్యక్రమాలకు ఆయన ఒక వాహిక లాగా నిలవడమే గాక వాటిపై తనదైన ముద్ర వేశారు.
 
ఈయన [[జులై 15]], 1901లో నారయణస్వామి, సూరమ్మ దంపతులకు జన్మించాడు. 1921, జనవరి 26న కార్యదీక్షకై గృహపరిత్యాగం చేసాడు. 1921 లోనే చదువుకు స్వస్తి చెప్పి జాతీయ ఉద్యమంలో చేరాడు. 1922లో [[రాజమండ్రి]]లో మొదటిసారి జైలు శిక్షను అనుభవించాడు. 1924లో [[కాకినాడ]]లో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలో వాలంటరీ కమాండర్ గా పనిచేసాడు. 1926-30 నిజాం సంస్థానంలో lM &S చదివి, అక్కడి, సంస్కరణోద్యమాలతో సంబంధాలు నెలకొల్పాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. 1931లో డాక్టరు డిగ్రీ పట్టా పొందారు. 1934 లో కమలమ్మగారితో పరిచయం. కాకినాడలో వైద్యవృత్తిని నిర్వహించాడు. ఇంకా జిల్లా హరిజన సంఘ అద్యక్షులుగా 1935 లో వ్యవహరించాడు. ఈయన డాక్టరుగా 1937 నుండి [[రంగూన్]]లో ఉన్నాడు. 1948-1952లలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ప్రకారం అరెస్టు కాబడి, కడలూరు జైలులో శిక్ష అనుభవించాడు. 1952లో కాకినాడ [[పార్లమెంటు]] సభ్యునిగా తొలి లోక్‌సభకు సి.పి.ఐ ([[కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా]]) అభ్యర్ధిగా ఎన్నికైనాడు. 1957, 1962లలో తిరిగి కాకినాడ నియోజకవర్గము నుండి సి.పి.ఐ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీచేసినా గెలుపొందలేదు. రామారావు 84 సంవత్సరాల నిండైన సార్థక జీవితాన్ని గడిపి [[సెప్టెంబరు 25]],[[1985]]న దివంగతులైనాడు.
 
[[వర్గం:1901 జననాలు]]
[[వర్గం:1985 మరణాలు]]
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:1వ లోకసభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/చెలికాని_రామారావు" నుండి వెలికితీశారు