కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి జిల్లా మారినందున సవరణలు
పంక్తి 72:
[[మహాశివరాత్రి]] సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది.<ref>{{cite wikisource|title=చిన్ననాటి_ముచ్చట్లు|chapter=మా_ఊరు |author=కె. ఎన్. కేసరి|date=1953}}</ref> ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు.కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు. ఈ ప్రభల ఊరేగింపులో మ్రొక్కుబడులున్న వారు ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ వుంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తూ వుంటే, అలంకరించిన మువ్వల, గజ్జల, గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగినట్లుంటుంది. గ్రామాలగుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్థులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వార పోయగా, పురుషులు కత్తి చేత బట్టి, దండకాలను చదువుతారు.<ref>{{cite wikisource|title=తెలుగువారి జానపద కళారూపాలు|chapter=కోటప్పకొండ ప్రభల విన్యాసం|author=మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి}}</ref>
 
ఈ ఉత్సవంలో భాగంగా చిన్న పిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే, పెద్దలు దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తు ప్రభలను నిర్మిస్తారు.ఊరేగింపులో బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాలవంటి పలు కార్యక్రమాలు ఉంటాయి.గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి శివుడికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో [[మేడారంసమ్మక్క సారక్క జాతర]] తరువాత రెండో అతిపెద్ద జన జాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది.
 
=='''వసతి సౌకర్యాలు'''==
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు