సురభి నాటక సమాజం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజము త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందములుగా వృద్ధిచెందినది. ప్రతి బృందము దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయము సమృద్ధిగా ఉండేవి. వనారస గోవింద రావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబము వ్యాపించిన కొలది బృందములు కూడా వ్యాపించినవి. సినిమా మరియు టివీల ఆగమనముతో [[1974]] కల్లా బృందముల సంఖ్య 16కు క్షీణించినది. [[1982]] నాటికి కేవలము నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నవి. ప్రస్తుతము ఆంధ్ర దేశములో సురభి నాటక కళాసంఘము ఆధ్వర్యములో ఐదు నాటక బృందములు పనిచేస్తున్నవి.
 
వీటిలో అన్నింటికంటే పెద్దదైన శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి [[1937]] లో గోవిందరావు ఐదవ కూతురు సుభద్రమ్మ మరియు ఆమె భర్త ఆర్.వెంకట్రావు చే స్థాపించబడినది. ప్రస్తుతము ఆ బృందములో వీరి కుమారులు భోజరాజు, బాబ్జి మరియు గణపతి రావులు మరియు వారి కుటుంబములు అంతా కలిపి 62 మంది సభ్యులు కలరు.
 
వీరి నాటకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం [మాయాబజార్]. ఆభిమన్యుడు, శశిరేఖ వివాహానికి ఘటోత్కచుడు అనే రాక్షసుడు (భీమ, హిడింబ కుమారుడు) తన మాయాజాలంతో జరిగేటట్లు చేయడం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంది. కళాకారులు పెద్దగా చదువుకోకపోయిన, సినిమాలో లాగా, సెట్టింగులతో యుధ్ధం జరిగినపుడు, మంటలు సృష్టించటం ఆతరువాత వాన కురిపించడం, అలాగే ఒకే సమయంలో రంగస్థలంపై, అభిమన్యుడు, శశిరేఖ వేరు వేరు సెట్టింగులలో విరహ గీతం పాడటం చాలా ఆకర్షణగా వుంటుంది.
ఇలాంటి నాటక సమాజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు
తొలితెలుగు సినీనటీమణి [[సురభి కమలాబాయి]] సురభి కళాకారుల కుటుంబములో పుట్టి పెరిగినదే.
 
"https://te.wikipedia.org/wiki/సురభి_నాటక_సమాజం" నుండి వెలికితీశారు