అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 154:
==అభిప్రాయాలు==
*'''వావిలాల సుబ్బారావు'''".....అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ. .. అనుభవంలోకో ఆలోచనలోకో జార్చేది కవిత.. అమరావతి కథలలో చాలా భాగం ఈ హద్దుకు అటొక్క కాలు, ఇటొక్క కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వం లాంటి "లిరికల్ కథలు" అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు... అమరావతి కథలు వస్తువుకన్నా కథా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయి. వ్రాసే నేర్పుంటే ఏదయినా కథా వస్తువేనని, మనోలాలిత్యం, శిల్పనైపుణ్యం, కవితాకోణంతో కూడా అందమయిన కథలు వ్రాయొచ్చని సత్యంగారు నిరూపించారు" .<ref name="vavilala"/>
*'''ఎమ్వీయల్''' పుస్తకం చివరలో "మారేడు దళం" అనే పద్య రూప ప్రశంసలో <ref>"అమరావతి కథలు" పుస్తకంలో చివరిమాటగా "మారేడు దళం" </ref> శంకరమంచి అమరావతి కథలు.....విశ్వరూప సాక్షాత్కారం........ప్రతి కథలోనూ చివరిలో ఉండే కొస మెరుపే కథలకి మకుటం......తెలుగుదేశ చరిత్ర.....తెలుగు వారికి దొరికిన మహా ప్రసాదం....కథలన్న కధలా! ఎలాంటి కథలవి!......అతగాడి రాత బాపుగీత వెలుగు వెన్నెల కలనేత.
<poem>
<blockquote>
శంకరమంచి అమరావతి కథలు
పరమ శివునికి అక్షరాభిషేకం, మహా నివేదన, ఆ భాషాపాణికి కరకంకణం
....
ప్రతి కథలోనూ చివరిలో ఉండే కొస మెరుపే కథలకి మకుటం
అంచేత ఇది అక్షరాలా లక్షణమైన కథా శతకం
....
అలనాడు తిక్కన శ్రీనాధుడు రాయలు
ఇలనాడు శ్రీపాద మల్లాది శంకరమంచి
చాలు తెలుగు భాషకి ప్రాణప్రతిష్ఠ చేయడానికి
</blockquote>
</poem>
*'''తాతా ప్రసాద్''' అనే సాహిత్యాభిమాని ఇలా అన్నాడు "........ ఈ కథలలో శిల్పమే ఆ కథలకు ప్రాణం". <ref>[http://www.bhaavana.net/telusa/jan96/0107.html "తెలుసా" చర్చా వేదిక] - తాతా ప్రసాద్ వ్యాఖ్య</ref>
*'''జంపాల చౌదరి''' మరొక సాహిత్యాభిమాని, ఇలా అన్నాడు - ఈ కథలలో గత స్మృతులు, మానవ సంబంధాలు, కాలం ముద్రలు, విషాదం, హాస్యం, వ్యంగ్యం పెనవేసుకొని ఉన్నాయి........ ఈ కథలు చదువరుల గుండె అంచులను పట్టుకొని లాగుతాయి....... <ref>[http://www.bhaavana.net/telusa/jan96/0098.html "తెలుసా" చర్చా వేదిక] - జంపాల చౌదరి </ref>
"https://te.wikipedia.org/wiki/అమరావతి_కథలు" నుండి వెలికితీశారు