బురఖా: కూర్పుల మధ్య తేడాలు

→‎బురఖా వ్యతిరేక వాదనలు: మ్యాపు చేర్చాను
పంక్తి 26:
 
==బురఖా వ్యతిరేక వాదనలు==
[[Image:Hijab world2.png|thumb|300px|ప్రపంచ వ్యాప్తంగా [[హిజాబ్]] (బురఖా) ధరించేవారిని సూచించే మ్యాపు.{{Fact|date=October 2008}}]]
* ఫాత్‌మా మెర్నిస్సి, రిప్ఫత్ హసన్, రాణా హుస్సేని, అమీనా వదూద్ లు "ఇస్లామిక్ ఫెమినిజం" కోసం పోరాడుతున్నారు. బురఖాను టర్కీ ప్రజాస్వామ్య నేత [[కమాల్ పాషా ]] నిరసించాడు. యస్.యమ్.అక్బర్ రాసిన వెధవ ఘోషా కథ స్త్రీల పత్రిక అయిన 'గృహలక్ష్మి'లో 1939 జనవరి సంచికలో ప్రచురితమైంది. ఒక ముస్లిం పురుషుడు రచించిన 'తొలి' తెలుగు ముస్లిం 'స్త్రీ వాద' కథ ఇది. బురఖా అనే కట్టుబాటు ఏడవ శతాబ్ది అరేబియాలో అవసరమయ్యింది. 20వ శతాబ్దంలో దాని అవసరం లేదు. స్వార్ధపరులైన మగవారు కట్టుబాట్లన్నింటినీ స్త్రీలకు ఏర్పరచి 'తాము మాత్రం ' బజారుల వెంట బయలుదేరుతున్నారు. ఘోషావల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. బురఖా ఒక అలంకారం కూడా కాదు. దేవుడిచ్చిన గాలి, సూర్యరశ్మి లేక పాలిపోయి, తెల్లబడి, ఇంట్లోనే ఉండి దుర్గంధవాయువునే పీలుస్తోంటే నానా జబ్బులకు గురి కావలసి వస్తుంది. నీడలో పెరిగిన మొక్కకూ, ప్రకృతిలో పెరిగిన మొక్కకూ తేడా లేదా? స్వార్ధపరులైన పురుషులు స్త్రీల హక్కుల్ని కాలరాచి వేస్తున్నారు. ఈ బురఖా ముక్కునీ, కళ్ళనీ కప్పుతూ పలుచటి తెరను కల్గిన '[[నఖాబ్]]' ఉన్న ఫుల్ బురఖాలా ఉంటుంది. బురఖా కారణంగా కన్ఫ్యూజ్ అవ్వొచ్చు. బురఖా (నఖాబ్‌తో కూడినది) వేసుకుంటే భర్త భార్యనీ, భార్య భర్తనీ గుర్తించలేనంతగా చీకటి ఏర్పడుతుంది. "పుట్టుమచ్చ" "ఖబడ్దార్" లాంటి రచనలు బురఖా, నఖాబ్, "ఘోషా", [[పరదా (ఇస్లాం)|పరదా]] లను నిరసిస్తున్నాయి. ఈనాటి స్త్రీలు కేవలం సంఘానికి భయపడే గోషా పాటిస్తున్నారు. బురఖాతో సినిమాలకు వెళుతున్నారని విమర్శిస్తున్నాయి. ప్రవక్త పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ హక్కులనిచ్చాడు. చాందస హిందువుల బారినుండి బాల్య వివాహాలను నిషేధించి , స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలను సాధించినట్లే ముస్లిం స్త్రీలకు ఈ [[గోషా]] బెడద పోవాలని ఘోషిస్తున్నారు. --డాక్టర్ మహబూబ్ భాషా, [[అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ]] లో చరిత్ర ఉపన్యాసకులు.
 
"https://te.wikipedia.org/wiki/బురఖా" నుండి వెలికితీశారు