నీలిమందు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
==చరిత్ర==
ఇండిగో అంటే ఊదా రంగు.
నీలిమందు కీ [[భారతదేశం|భారతదేశానికీ]] చాలా గట్టి లంకె ఉంది. [[సింధు నాగరికత]] రోజులనుండీ వృక్షసంపద నుండి రంగులు తీసి వాడటం భారతీయులకి తెలుసు. [[హరప్పా]] దగ్గర దొరకిన ఒక [[వెండి]] పాత్ర చుట్టూ చుట్టబెట్టిన అద్దకపు బట్టే దీనికి నిదర్శనం. [[అజంతా గుహలు|అజంతా గుహలలో]] ఉన్న చిత్రాలలో మొక్కలనుండి తీసిన రంగులు కనిపిస్తున్నాయి. [[కౌటిల్యుడు|కౌటిల్యుడి]] [[అర్ధశాస్త్రం]] లో రంగుల ప్రస్తావన ఉంది. రంజనాలు మొక్కల నుండి తయారు చెయ్యటమే కాకుండా వాటిని బట్టలకి అద్దటంలో ఉన్న సాంకేతిక సూక్ష్మాలని కూడ కనిపెట్టేరు భారతీయులు. ఎనిమిదవ శతాబ్దం నాటికే మధ్య ఆసియాలోనూ, [[ఈజిప్ట్]] లోనూ భారతదేశంలో చేసిన [[అద్దకం]] బట్టలు మంచి ప్రాచుర్యంలో ఉండేవి. పదమూడవ శతాబ్దంలో ఇండియా వచ్చిన [[మార్కోపోలో]] ఇండియాలో నీలిమందు వాడకం గురించి ప్రస్తావించేడు. అప్పటికి గ్రీకు దేశంలోనూ, రోములోనూ ఈ నీలిరంగు రంజనం వాడకంలో లేకపోలేదు. కాని ఈ రంగుకి 'ఇండిగో' అన్న పేరు రావటానికి [[మార్కోపోలో]] ఇండియాలో ఈ రంగుని చూడటమే అని అభిజ్ఞవర్గాల నమ్మకం. గ్రీకు భాషలో "ఇండికాన్" అన్నా లేటిన్ భాషలో "ఇండికమ్" అన్నా "ఇండియా నుండి వచ్చినది" అనే అర్ధం.
 
"https://te.wikipedia.org/wiki/నీలిమందు" నుండి వెలికితీశారు