అహోబిలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: = Official → = అధికార, ISTIST , PINపిన్‌కోడ్
జిల్లా మారినందున సవరణలు
పంక్తి 27:
| subdivision_name1 = [[ఆంధ్ర ప్రదేశ్]]
| subdivision_type2 = [[జిల్లా]]
| subdivision_name2 = [[కర్నూలునంద్యాల జిల్లా]]
| established_title = <!-- Established -->
| established_date =
పంక్తి 85:
| subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
| subdivision_type1 = [[జిల్లా]]
| subdivision_name1 = [[కర్నూలునంద్యాల జిల్లా|కర్నూలు]]
| subdivision_type2 = [[మండలం]]
| subdivision_name2 = [[ఆళ్లగడ్డ]]
పంక్తి 147:
}}
 
'''అహోబిలం''', [[కర్నూలునంద్యాల జిల్లా]], [[ఆళ్లగడ్డ మండలం|ఆళ్లగడ్డ మండలానికి]] చెందిన గ్రామం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2014-04-05 |archive-url=https://web.archive.org/web/20121001000707/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |archive-date=2012-10-01 |url-status=dead }}</ref> పిన్ కోడ్ : 518 543. ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది.
[[File:Lower (Diguva) Ahobilam Temple 01.gif|thumb|దిగువ అహోబిలం ఆలయం]]
[[బొమ్మ:UgrasthaMbamu.jpg|thumb|ఉగ్ర స్తంభము]]
పంక్తి 207:
[[దస్త్రం:Trek_to_Ugra_stambham_at_Ahobilam.jpg|thumb|అహోబిలంలో ఉగ్రస్తంభానికి చేరుకునేందుకు వెళ్లాల్సిన మార్గం]]
అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా [[వైష్ణవ]] యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి [[స్వయంభువు]]గా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు.
ఈ క్షేత్రం కర్నూలునంద్యాల జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం.
దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లాదవరదుని సన్నిధానం [[లక్ష్మీనరసింహస్వామి]] విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి.
వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచారు. [[తిరుమల]], అహోబిలం, [[శ్రీశైల క్షేత్రం|శ్రీశైలం]] స్వయం వ్యక్త క్షేత్రాలు.
పంక్తి 402:
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు]]
[[వర్గం:కర్నూలునంద్యాల జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:శ్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/అహోబిలం" నుండి వెలికితీశారు