మౌలానా హస్రత్ మోహాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
ఇతడు ఒక చురుకైన విద్యార్థి, అన్ని పరీక్షలలో రాష్ట్రస్థాయిలో ఉన్నతుడు. తరువాత [[అలీఘర్ ముస్లిం యూనివర్శిటి|అలీఘర్]] లో చదివాడు. ఇతడు [[మొహమ్మద్ అలీ జౌహర్|మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్]], [[షౌకత్ అలీ (రాజకీయ నాయకుడు)|షౌకత్ అలీ జౌహర్]] ల [[మిత్రుడు]]. ఇతని రచనలు 'కులియాత్-ఎ-హస్రత్ మోహాని', 'షర్హ్-ఎ-కలామ్-ఎ-గాలిబ్', 'నుకాత్-ఎ-సుఖన్', 'ముషాహిదాత్-ఎ-జిందాన్' మొదలగునవి. [[గజల్]] గాయకుడు [[గులాం అలి]] పాడిన '[[చుప్కే చుప్కే రాత్ దిన్|చుప్ కే చుప్ కే రాత్ దిన్ ఆఁసూ బహానా యాద్ హై]]' ఇతని రచనే.
 
ఇతడు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ వారికి ఎదురుగా నిర్భయంగా పోరాడిన వీరుడు. ఆజాదియె-కామిల్ (సంపూర్ణ స్వరాజ్యం) కావాలంటూ 1921 లో డిమాండ్ చేసిన మొదటివ్యక్తి. ఆల్ ఇండియా [[ముస్లిం]] లీగ్ ను అధ్యక్షత వహించాడు. [[కమ్యూనిజం]]పట్ల అభిమానమున్నవాడునూ. ఎన్నోసార్లు [[జైలు]]కు వెళ్ళాడు. ఇతని స్ఫురద్రూపాన్ని చూచి ఇతన్ని భారతరాజ్యాంగనిర్మాణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈకమిటీ సిఫారసులను చూసి నొచ్చుకొని నచ్చక సంతకం చేయలేదు. ఇతని సమకాలీన ఉర్దూ కవులు [[జోష్ మలీహాబాది]], [[నాసిర్ కాజ్మి]], [[జిగర్ మొరాదాబాది]], [[అస్గర్ గోండవి]].‘[[ఇంక్విలాబ్‌ జిందాబాద్‌]]’ నినాద సృష్టికర్త.ఈ నినాదం ‘హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌’ అధికార నినాదంగా మారింది.
 
ఇతను [[మే 13]], 1951, [[లక్నో]]లో మరణించాడు.