కాజోల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
తల్లిదండ్రులిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో పదహారేళ్లకే తొలి అవకాశం వచ్చింది. రాహుల్ రవైల్ దర్శకత్వంలో 'బెఖుడి'లో నటించే అవకాశాన్ని సంపాదించింది. వేసవి సెలవులు కావడంతో స్కూల్‌కి ఇబ్బంది కలగకుండా [[సినిమా]] పూర్తి చేసింది. అయితే ఆ సినిమా పరాజయాన్ని చవిచూసింది. అయినా... కాజోల్ నటన, అందం చూసి అప్పటికే '[[బాజీగర్]]' సినిమా కోసం ఎంపిక చేసుకొన్నారు. 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాజీగర్' వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో [[బాలీవుడ్]] దృష్టిలో పడింది. చదువులు పూర్తి కాకమునుపే స్కూల్‌కి గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయిలో సినిమాపై దృష్టిపెట్టింది.
 
1994లో 'ఉదార్ మే జిందగీ' అనే చిత్రంలో జితేంద్రకి మనవరాలిగా నటించింది. ఈ చిత్రం తెలుగులో విజయవంతమైన '[[సీతారామయ్యగారి మనవరాలు]]'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఆదరణకు మాత్రం నోచుకోలేదు. ఆ వెంటనే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో 'యే దిల్లగీ' చేసింది. [[అక్షయ్‌కుమార్]], [[సైఫ్ అలీఖాన్]] సరసన నటించింది. 1995లో ' [[కరణ్ అర్జున్]] ', '[[దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే']] చిత్రాలు చేశాక ఇక కాజోల్‌కి వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. ఆ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో కాజోల్ పేరు మార్మోగిపోయింది.
 
ప్రేమకథలకీ, కుటుంబ కథా చిత్రాలకే పరిమితమైపోతోంది. ఇతరత్రా కథలకు ఆమె న్యాయం చేయలేదేమో అనుకొంటున్న దశలోనే... కాజోల్ కీలకమైన నిర్ణయాలు తీసుకొంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలవైపు అడుగులేసింది. అందులో భాగంగా 'గుప్త్'లో నటించింది. ఆ చిత్రంలో వ్యతిరేక ఛాయలున్న పాత్ర పోషించింది. నటిగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత మళ్లీ తనదైన శైలిలో అడుగులేస్తూ 'ప్యార్ కియాతో డర్నా క్యా', 'ప్యార్ తో హోనా హై తా', 'కుచ్ కుచ్ హోతా హై'లాంటి సినిమాలు చేసింది. మధ్యలో 'దుష్మన్' కూడా చేసింది. అందులో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకొంది.
"https://te.wikipedia.org/wiki/కాజోల్" నుండి వెలికితీశారు