సుగ్రీవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ చేర్చాను
పంక్తి 8:
==వాలి సుగ్రీవుల వైరం==
[[బొమ్మ:Ramayan Vali Sugriva.jpg|thumb|[[కంబోడియా]]లోని Banteay లో ఒక గోడమీద చెక్కబడిన శిల్పంలో వాలి సుగ్రీవుల పోరాటం.]]
రామాయణంలో అరణ్య కాండ చివరి భాగంలో సుగ్రీవుని పాత్ర పరిచయమౌతుంది. సుగ్రీవుడు గొప్ప వీరుడు, ధర్మపరుడు, నిరంకుశుడు, కొంత చాపల్యం కలిగినవాడు, మిత్ర ధర్మానికి కట్టుబడినవాడుగా రామాయణంలో కనిపిస్తాడు. సుగ్రీవుడు దురదృష్టవశాన తనకంటే చాలా బలవంతుడైన అన్న [[వాలి]] క్రోధానికి గురై మరణభయంతో ఋష్యమూక పర్వతంపై బ్రతుకుతూ ఉంటాడు.
 
సీతాపహరణంతో హతాశులైన రామలక్ష్మణులు సీతను వెతుకసాగారు. మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. రామలక్ష్మణులు వాడి శరీరాన్ని తగులబెట్టారు. అప్పుడు కబంధుడు సకలాభరుణుడైన గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ – ''రామా! ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీకిప్పుడు ఒక మిత్రుని అవుసరం ఉంది. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకొంటే సీతను వెదకడంలో అతను నీకు సహాయపడతాడు. అతను కూడా నీలాగే భార్యా వియోగంతో దుర్దశాపన్నుడై ఉన్నాడు. ఋష్యమూక పర్వతంపై [[సుగ్రీవుడు|సుగ్రీవుని]] కలుసుకోవచ్చు. అతని స్నేహంతో రాక్షసులనందరినీ సంహరించి నీ జీవితేశ్వరిని పొందగలవు'' అని చెప్పాడు.
 
 
మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు.
హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి, మంచిమాటలతో వారి వివరాలు కనుక్కొని రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.
 
 
రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. కిష్కింధ రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. విధేయుడు. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలంలోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒకమాసం గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు. వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య రుమను చేబట్టి సుగ్రీవుని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.
 
దీనుడైన సుగ్రీవుని కధ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాలను గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.
 
==సుగ్రీవుడు వానర రాజుగా పట్టాభిషిక్తుడు అవడం==
"https://te.wikipedia.org/wiki/సుగ్రీవుడు" నుండి వెలికితీశారు