సుగ్రీవుడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుతున్నది
పంక్తి 43:
 
"జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః" అని కపి సేన లంకను ముట్టడించింది. మొదటిరోజు జరిగిన భీకరయుద్ధం చివరిలో ఇంద్రజిత్తు నాగపాశాలతో రామలక్ష్మణులు వివశులయ్యారు. అందరూ హతాశులయ్యారు. సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఓదార్చి అతనికి లంకాధిపత్యం నిశ్చయమన్నాడు. రామలక్ష్మణులను తీసికొని కిష్కింధకు వెళ్ళమని తన మామ సుషేణుడికి ఆనతిచ్చాడు. తాను రావణుడిని సపుత్ర బాంధవంగా నాశనం చేసి సీతమ్మను తీసుకొని వస్తానన్నాడు. ఇంతలో [[గరుత్మంతుడు]] వచ్చి నాగపాశాలనుండి విముక్తులను చేశాడు. యుద్ధంలో అంగదాది మహావీరులతో కలిసి విజృంభించిన సుగ్రీవుడు ఎందరో రాక్షసులను చంపేశాడు. కుంభకర్ణుడితో యుద్ధం జరిగే సమయంలో
సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకొని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకొని లంకవైపు వెళ్ళాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకొన్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని, రాక్షసుని ముక్కు, చెవులు కొరికివేసి ఒక్కగెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు. కుంభుడు సుగ్రీవుని పిడిగుద్దులతో హతుడయ్యాడు. సుగ్రీవుడి దెబ్బకు మహోదరుని తల వ్రక్కలయ్యింది. ఇంకా ఎందరో రాక్షసులు సుగ్రీవుని చేత హతులయ్యారు.
 
==విజయం==
కడకు రాముని బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. రాముని కోరికపై సుగ్రీవాదులు కూడా అయోధ్యకు వెళ్ళారు. జరిగిన సంగతులు తెలుసుకొని భరతుడు సుగ్రీవునితో -- నీవు నాకు మరొక సోదరుడివి -అన్నాడు. వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రామునిచేత బహుమతులు స్వీకరించి సుగ్రీవుడు తన సైన్యంతో కిష్కింధకు వెళిపోయాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/సుగ్రీవుడు" నుండి వెలికితీశారు