"భారతీయ జనసంఘ్" కూర్పుల మధ్య తేడాలు

1951 [[అక్టోబర్ 21]]న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. [[రాష్ట్రీయ స్వయం సేవక్]] భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా [[దీపం]] గుర్తు లభించింది. [[1952]]లో జరిగిన [[పార్లమెంటు]] ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోకసభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించినది. [[1967]] తరువాత ఈ పార్టీ బలపడింది.
==హిందూ జాతీయ వాదం==
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. [[1964]]లో ఏర్పడిన [[విశ్వ హిందూ పరిషత్తు]] ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. [[జబహార్జవహార్ లాల్ నెహ్రూ]] కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. [[రాజస్థాన్]], [[గుజరాత్]], [[మహారాష్ట్ర]], [[మధ్యప్రదేశ్]] మరియు [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.
==దేశంలో అత్యవసర పరిస్థితి కాలం==
[[1975]]లో దేశంలో [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వం [[అత్యవసర పరిస్థితి]] విధించడంతో విపక్షాలకు చెందిన పలు నేతలను ఎలాంటి కారణం లేకుండానే జైళ్ళకు తరలించారు. అదే కాలంలో భారతీయ జనసంఘ్ ప్రముఖ నేతలు కూడా జైలుజీవితం గడిపారు. [[1977]]లో అత్యవసరపరిస్థితిని తొలిగించి ఎన్నికలు జరుపడంతో దేశంలో మారిన రాజకీయ సమీకరణాల వలన భారతీయ జనసంఘ్‌తో పాటు [[భారతీయ లోక్‌దళ్]], కాంగ్రెస్ (ఓ), సోషలిస్ట్ పార్టీలు కలిసి ఉమ్మడిగా జనతా పార్టీనిేర్పాటు చేసుకున్నాయి. ఎన్నికలలో ఈ పార్టీ విజయం సాధించడంతో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం పేరు సంపాదించినది. [[మురార్జీ దేశాయ్]] నేతృత్వం వహించిన జనతా ప్రభుత్వంలో పూర్వపు జనసంఘ్ నేతలైన అటల్ బిహారీ వాజపేయికి విదేశాంగ మంత్రిత్వ శాఖ లభించగా, లాల్ కృష్ణ అద్వానీకి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లభించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/358348" నుండి వెలికితీశారు