భారతీయ జనసంఘ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==దేశంలో అత్యవసర పరిస్థితి కాలం==
[[1975]]లో దేశంలో [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వం [[అత్యవసర పరిస్థితి]] విధించడంతో విపక్షాలకు చెందిన పలు నేతలను ఎలాంటి కారణం లేకుండానే జైళ్ళకు తరలించారు. అదే కాలంలో భారతీయ జనసంఘ్ ప్రముఖ నేతలు కూడా జైలుజీవితం గడిపారు. [[1977]]లో అత్యవసరపరిస్థితిని తొలిగించి ఎన్నికలు జరుపడంతో దేశంలో మారిన రాజకీయ సమీకరణాల వలన భారతీయ జనసంఘ్‌తో పాటు [[భారతీయ లోక్‌దళ్]], కాంగ్రెస్ (ఓ), సోషలిస్ట్ పార్టీలు కలిసి ఉమ్మడిగా జనతా పార్టీనిేర్పాటుపార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నికలలో ఈ పార్టీ విజయం సాధించడంతో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం పేరు సంపాదించినది. [[మురార్జీ దేశాయ్]] నేతృత్వం వహించిన జనతా ప్రభుత్వంలో పూర్వపు జనసంఘ్ నేతలైన అటల్ బిహారీ వాజపేయికి విదేశాంగ మంత్రిత్వ శాఖ లభించగా, లాల్ కృష్ణ అద్వానీకి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లభించింది.
 
==భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం==
జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో [[1980]] లోకసభ ఎన్నికల ముందు పూర్వపు భారతీయ జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజపేయి భాజపాకు తొలి అద్యక్షుడిగా పనిచేశాడు. [[1989]] తరువాత ఈ పార్టీ బలపడింది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు [[ప్రధానమంత్రి]] పదవిని కూడా చేపట్టినాడు.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనసంఘ్" నుండి వెలికితీశారు