వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడీయా --> వికీపీడియా
ట్యాగు: 2017 source edit
→‎వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు: మరికొన్ని "ఏది వికీపీడియా కాదు"లు
ట్యాగు: 2017 source edit
పంక్తి 62:
=== వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు ===
వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు. నూటికి నూరుపాళ్ళూ నిజమైన ప్రతి విషయమూ వికీపీడియాలో చేర్చదగినదేం కాదు. వికీపీడియా వ్యాసాలు..
# '''సృజనాత్మక కృతుల సంగ్రహాన్ని ప్రచురించే సైటు కాదు.''' సృజనాత్మక కృతులను (ఉదాహరణకు సాహితీ కృతులు, చిత్రాలు, వీడియో గేములు, డాక్యుమెంటరీలు, పరిశోధనా ప్రచురణలు, ఆధ్యాత్మిక గ్రంథాలు మొదలైనవి) వికీపీడియా విజ్ఞానసర్వస్వం ధోరణి లోనే చూస్తుంది. ఆ కృతిని ఎలా అభివృద్ధి చేసారు, దాని రూపురేఖలేంటి, దానికి ఎలాంటి ప్రజాదరణ లభించింది, దాని ప్రశస్తి ఏంటి, దాని ప్రభావం ఏంటి అనేవాటి గురించి రాయాలి. అలా రాస్తూ కావాలంటే ఆ కృతులను సంక్షిప్తంగా రాయవచ్చు.
# '''పాటల సాహిత్యాన్ని ప్రచురించే సైటు కాదు''' ఏదైనా సినిమా పాట గురించి గానీ, ఇతర గేయాల గురించి గానీ పేజీ రాస్తే అందులో ఆ పాట ఎవరు రాసారు, ఎప్పుడు ప్రచురించారు, ఏ సినిమాలో వచ్చింది, ఎవరు నటించారు, గాయకులు, సంగీత కర్త, రాగం, అది కలిగించిన ప్రభావం వగైరా విషయాలను రాయాలి. పాట లోని ఏదైనా భాగాన్ని ఉల్లేఖించాలంటే దాన్ని క్లుప్తంగా, మిగతా వ్యాస పరిమాణానికి సరైన నిష్పత్తిలో ఉండేలా రాయాలి. ఆ ఉల్లేఖన ఏదైనా చర్చకు దారితీసేదై ఉండాలి లేదా శైలిని వివరించేలా ఉండాలి. పాట సాహిత్యం మొత్తాన్ని పెట్టాలంటే [[వికీసోర్స్]] లో పెట్టవచ్చు. {{#expr:{{CURRENTYEAR}} - 96}} తరువాత ప్రచురించిన పాటల సాహిత్యంలో చాలావరకు కాపీహక్కుల పరిధిలో ఉంటాయి; వాటిని ఉల్లేఖించే పనైతే దాన్ని వీలైనంత కనిష్ఠ పరిమాణంలో ఉంచాలి. అది కూడా ఏదైనా శైలిని వివరించే సందర్భం లోనో, లేదా ఏదైనా వ్యాఖ్య చేసే సందర్భంలోనో మాత్రమే ఉదహరించాలి. ఆ పాటకు సంబంధించి బయటి లింకు ఇచ్చేటపుడు, సదరు సైటుకు ఆ పాటను పంపిణీ చేసే కాపీహక్కు ఉందని నిర్థారించుకున్నాకే ఇవ్వాలి.
# '''తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు కాదు'''. వ్యాసాల్లో తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు చేర్చరాదు. దాని బదులు, అదే సమాచారాన్ని ఓ పద్ధతిలో వ్యాసంగా అమర్చండి.
# '''అనేక చిన్న చిన్న విషయాలను గుదిగుచ్చి చూపించే సంగ్రహం కాదు''': సూక్తులు, గొప్పవారి ఉటంకింపులు, ఉల్లేఖనలు మొదలైన వాటి ఏరి కూర్చి పెట్టే సంగ్రహం కాదు.