వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హిందువులపై అకృత్యాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఈ వ్యాసము తొలగించుట ఏ విధముగాను సమ్మతము కాదు. ఆంగ్ల వికీలో ఉన్...
 
Reply
పంక్తి 1:
ఈ వ్యాసము తొలగించుట ఏ విధముగాను సమ్మతము కాదు. ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసమును నేను తెలుగులో అనువదిస్తున్నాను. ప్రస్తుతము ఈ వ్యాసముపై ఎట్టి వివాదము లేదు. ఈ వ్యాసము చారిత్రక సత్యాలను ఉటంకిస్తూ తగు ఆధారాలతో వ్రాయబదింది కాబట్టి. నిరాధారమగు విషయములు ఎవరైనా చూపగలిగితే ఆ వాక్యములు తొలగిస్తాను. లేని వివాదములు సృష్టించ వద్దని నా మనవి.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 13:24, 5 డిసెంబర్ 2008 (UTC)
:గత కొద్ది రోజులుగా వికీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తుంటే ఇలాంటి వ్యాసాల మూలంగా ఇంకొక మతానికి చెందిన వ్యాసాలు వెలువడేలా అనిపిస్తున్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఎలాంటి అక్షర సత్యమయినా సరే, వివాదాస్పదం (లేదా) నమ్మకాలను నొప్పించే వ్యాసాలను వెంటనే తొలగించాలి. నిర్వాహకులకు - దాదాపు నెలరొజుల క్రితమే సూచించాను వివాదాస్పద వ్యాసాలను మొగ్గలోనే తృంచివేయాలి అని. మరో సారి అదే పునరావృతం కాకుండా ఈ వ్యాసాన్ని, ఇలాంటి మిగతా వ్యాసాలను తక్షణం తొలగించ ప్రార్థన. --[[సభ్యులు:Svrangarao|Svrangarao]] 13:36, 5 డిసెంబర్ 2008 (UTC)