ఇల్లాలి ముచ్చట్లు (శీర్షిక): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==ఇల్లాలి ముచ్చట్లు చిహ్నం (LOGO)==
[[బొమ్మ:illali mutchatlu_logo.jpg|150px|left|thumb|తెలుగు వార పత్రికల చరిత్రలో,ప్రసిద్ధి చెందిన "ఇల్లాలి ముచ్చట్లు" శీర్షిక చిహ్నం]]
ఒక వ్యాస శీర్షికకు ప్రత్యేక చిహ్నం ఉండటం అన్నది, తెలుగు వారపత్రికలలో ఇదే మొదటిది అయిఉండవచ్చును. తెలుగు వారిళ్ళల్లో, మహిళలు వంట చెయ్యటం అన్నది సర్వ సామాన్యం. పూర్వం కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. తరువాత, తరువాత, బొగ్గుల కుంపట్లు వచ్చినాయి. కట్టెల పొయ్యి, గ్యాస్ స్టౌవ్ కు మధ్య, తెలుగు మహిళలు ఎక్కువ కాలం బొగ్గుల కుంపట్ల మీదనే దశాబ్దాలపాటు వంటలు చేసి తమ తమ కుటుంబ సభ్యులకు ఆప్యాంయంగా వడ్డించారు. కుంపటి ముందు కూచుని, అవసరమైనప్పుడు విసినకర్రతో విసురుతూ, వంట చేస్తున్నప్పుడు, కొంత ఆలోచించటానికి మహిళలకు అవకాశం ఉండేది(కుంపట్ల మీద వంట నెమ్మదిగా జరుగుతుంది కనుక). అటువంటి ఆలోచనలను, తన బుర్రలో వండి పురాణం సీత పాఠకులకు అందిస్తున్నట్టు ఉంటుంది ఈ చిహ్నం . కుంపటి మీద బాణలి నుంచి అట్లకాడతో బయటకు తీయబడుతున్న పదార్ధం భూగోళం ఆకారంలో వెయ్యటంలో ఉద్దేశ్యం, ఈ శీర్షిక భూమ్మీద ఉండే/జరిగే ప్రతి విషయాన్ని సృశిస్తుందని సూచిస్తుంది.