కూనలమ్మ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

అనవసర వర్గాల తొలిగింపు
పంక్తి 85:
గుండె ఊయలలూపు<br>
ఓ కూనలమ్మా!
*కూనలమ్మ పదాలు
లోకానికి సవాలు
ఆరుద్ర చేవ్రాలు
అంటాడు శ్రీశ్రీ
#సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ
#ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఓ కూనలమ్మ
#సామ్యవాద పథమ్ము
సౌమ్యమైన విధమ్ము
సకల సౌఖ్యప్రదమ్ము
ఓ కూనలమ్మ
# అరుణబింబము రీతి
అమర నెహ్రూ నీతి
ఆరిపోవని జ్యోతి
ఓ కూనలమ్మ
#సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ
#ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఓ కూనలమ్మ
#తెలివితేటల తాడు
తెంపుకొను మొనగాడు
అతివాద కామ్రేడు
ఓ కూనలమ్మ
#ఇజము నెరిగిన వాడు
నిజము చెప్పని నాడు
ప్రజకు జరుగును కీడు
ఓ కూనలమ్మ
#స్టాలినిస్టు చరిత్ర
సగము గాడిదగత్ర
చదువుకో ఇతరత్ర
ఓ కూనలమ్మ
#మధ్యతరగతి గేస్తు
మంచి బందోబస్తు
జనులకిక శుభమస్తు
ఓ కూనలమ్మ
#దహనకాండల కొరివి
తగలబెట్టును తెలివి
కాదు కాదిక అలవి
ఓ కూనలమ్మ
#కూరుచుండిన కొమ్మ
కొట్టుకొను వాజమ్మ
హితము వినడు కదమ్మ
ఓ కూనలమ్మ
# కష్టజీవుల కొంప
కాల్చి బూడిద నింప
తెగునులే తన దుంప
ఓ కూనలమ్మ
#జనుల ప్రేముడి సొమ్ము
క్షణము లోపల దుమ్ము
తులువ చేయును సుమ్ము
ఓ కూనలమ్మ
#మధువు మైకము నిచ్చు
వధువు లాహిరి తెచ్చు
పదవి కైపే హెచ్చు
ఓ కూనలమ్మ
#హరుడు అధికుడు కాడు
నరుడు అల్పుడు కాడు
తమకు తామే ఈడు
ఓ కూనలమ్మ
#సుదతిపాలిట భర్త
మొదట వలపుల హర్త
పిదప కర్మకు కర్త
ఓ కూనలమ్మ
#చివరి ప్రాసల నాభి
చిత్రమైన పఠాభి
కావ్యసుధట షరాభి
ఓ కూనలమ్మ
#తీర్చినట్టి బకాయి
తెచ్చిపెట్టును హాయి
అప్పు మెడలో రాయి
ఓ కూనలమ్మ
#నిజము నిలువని నీడ
నీతి యన్నది చూడ
గాజు పెంకుల గోడ
ఓ కూనలమ్మ
#చెప్పి దేవుని పేరు
చెడుపు చేసెడివారు
ఏల సుఖపడతారు
ఓ కూనలమ్మ
#ఈశుడంతటివాడు
ఇల్లరికమున్నాడు
పెండ్లయిన మరునాడు
ఓ కూనలమ్మ
#మరియెకరి చెడు తేది
మనకు నేడు ఉగాది
పంచాంగమొక సోది
ఓ కూనలమ్మ
# జనులు గొర్రెలమంద
జగతి వేసెడు నింద
జమకట్టు స్తుతి క్రింద
ఓ కూనలమ్మ
# ఉడుకు రచనల యందు
ఎడద మెదడుల విందు
లేటు గోపీచందు
ఓ కూనలమ్మ
#ఇరకు కార్యపు గదులు
ఇరుకు గోడల బదులు
మేలు వెన్నెల పొదలు
ఓ కూనలమ్మ
#కోర్టుకెక్కిన వాడు
కొండనెక్కిన వాడు
వడివడిగ దిగిరాడు
ఓ కూనలమ్మ
#పరుల తెగడుట వల్ల
బలిమి పొగడుట వల్ల
కీర్తి వచ్చుట కల్ల
ఓ కూనలమ్మ
#కోపాగ్నులకు వృద్ధి
కుత్సితాలకు రద్ది
లేమి చంపు సుబుద్ధి
ఓ కూనలమ్మ
#అతివ పలుకే చాలు
అందు వేనకువేలు
మొలచు నానార్థాలు
ఓ కూనలమ్మ
#చెక్కు చెదరని వక్త
చేదు నిజము ప్రయోక్త
చంపబడును ప్రవక్త
ఓ కూనలమ్మ
#ఎంకి పాటల దారి
ఎడద గుర్రపు స్వారి
చేయులే నండూరి
ఓ కూనలమ్మ
# ఆలు మగల లడాయి
అంత మొందిన రేయి
అనుమానపు హాయి
ఓ కూనలమ్మ
# బ్రూటు కేసిన ఓటు
బురదలో గిరవాటు
కడకు తెచ్చును చేటు
ఓ కూనలమ్మ
#రాజముద్రికె మొహరు
ప్రజల నేతయె నెహురు
స్వేచ్ఛ పేరే యుహురు
ఓ కూనలమ్మ
#జనులు నమ్మెడివరకు
కనులు తెరవని వరకు
వెలుగు నకిలీ సరకు
ఓ కూనలమ్మ
#పాత సీసాలందు
నూతనత్వపు మందు
నింపితే ఏమందు?
ఓ కూనలమ్మ
#అయిదు రోజులు వేస్టు
అగుట కెయ్యది బెస్టుఝ
చూడుము క్రికెట్ టెస్టు
ఓ కూనలమ్మ
#'అతడు - ఆమె'ల ఫైటు
అతివ ఛాన్సులు బ్రైటు
ఆడదెపుడూ రైటు
ఓ కూనలమ్మ
# ఆత్మవంచన వల్ల
ఆడు కల్లల వల్ల
అగును హృదయము డొల్ల
ఓ కూనలమ్మ
#వాతలుండిన నక్క
వ్యాఘ్రజాతిలొ లెక్క
అనును కద తలతిక్క
ఓ కూనలమ్మ
#నూతిలోపలి కప్ప
పాతఘనతలు తప్ప
మెచ్చ దితరుల గొప్ప
ఓ కూనలమ్మ
నరుడు మదిలో దొంగ
నాల్క బూతుల బుంగ
కడుగ జాలదు గంగ
ఓ కూనలమ్మ
#పంగనామము లేల
భస్మ పుండ్రము లేల
భక్తి నిజమగు వేళ
ఓ కూనలమ్మ
#అతివ పురుషుని దీటు
అనుచు నభమున చాటు
ఆడ కాస్మోనాటు
ఓ కూనలమ్మ
# ప్రజలు చేసెడి పొదుపు
ప్రభుత ఫ్యాడుల మదుపు
సంగయాత్రలో కుదుపు
ఓ కూనలమ్మ
#కొత్త పెండ్లము వండు
గొడ్డుకారము మెండు
తీపియను హస్బెండు
ఓ కూనలమ్మ
#పాత బిరుదముకన్న
పదవియే కద మిన్న
హ్యూము చాటెను మొన్న
ఓ కూనలమ్మ
#గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము
కూళతో స్నేహమ్ము
ఓ కూనలమ్మ
#పిరికి ఎలుకల జంట
పిల్లి మెడలో గంట
వెళ్లికట్టిన దంట
ఓ కూనలమ్మ
#లంచమనియెడి ఉప్పు
క్లార్కు తింటే తప్పు
ఘనుడు తింటే మెప్పు
ఓ కూనలమ్మ
#హృదయమున్న విమర్శ
మెదడు కలచు విమర్శ
తిట్టు నెచ్చెలి స్పర్శ
ఓ కూనలమ్మ
#హాస్యమందున అఋణ
అందెవేసిన కరుణ
బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మ
#ఆపరేషను శిక్ష
ఆయుధమ్ముల భిక్ష
ప్రక్కవాడికి కక్ష
ఓ కూనలమ్మ
#అత్తవారిని మొక్క
అలక పానుపు యెక్క
మృగము కిందే లెక్క
ఓ కూనలమ్మ
#పడతి వలపుల కలలు
పండి వేసెడి గెలలు
వెలుగు నీడల వలలు
ఓ కూనలమ్మ
# కుమతియొక్క సమీక్ష
గుబ్బ యెముక పరీక్ష
చేయువలయు ఉపేక్ష
ఓ కూనలమ్మ
#ఏకపత్నీ వ్రతము
ఎలుగెత్తు మన మతము
వేల్పు భార్యలో? శతము!
ఓ కూనలమ్మ
#పాలకోసము రాళ్లు
భరియించుమను వాళ్లు
తాము వంచరు వళ్లు
ఓ కూనలమ్మ
# గంగగట్టున నూయి
కందకములో గోయి
త్రవ్వేను లొల్లాయి
ఓ కూనలమ్మ
#ఆశ తీరని తృష్ణ
అఘము తేలని ప్రశ్న
ప్రతిభ అడవుల జ్యోత్స్న
ఓ కూనలమ్మ
#బండి కూల్చెను తొల్లి
బండి తోలెను మళ్లి
దండి ఊసరవెల్లి
ఓ కూనలమ్మ
#మేనమామకు యముడు
మేనయత్తకు మరుడు
ఘనుడుకద మాధవుడు
ఓ కూనలమ్మ
#గుడి గోడ నలరారు
పడతిదుస్తుల తీరు
ఫిల్ములో సెన్సారు
ఓ కూనలమ్మ
# చలిహోమ గుండాలు
పలు సోమపానాలు
అది బార్-బి-క్యూలు
ఓ కూనలమ్మ
#పుణ్య గాథల బూతు
బూజు పట్టిన ట్రూతు
అంతు చిక్కదు లోతు
ఓ కూనలమ్మ
#గ్రోలెనే స్తన్యమ్ము
గ్రుద్దెనే ఆ రొమ్ము
వాడెపో దైవమ్ము
ఓ కూనలమ్మ
# భక్తి తేనెల యేరు
పసిడి కలల బిడారు
కలసి పోతనగారు
ఓ కూనలమ్మ
#తగిన సమయము చూచి
తాను వేయును పేచి
పాలిటిక్సుల బూచి
ఓ కూనలమ్మ
#కులము నిచ్చెన నెక్క
గుణము కిందికి తొక్క
దివికి చేరున నక్క?
ఓ కూనలమ్మ
#కటిక మూర్ఖుల క్రొవ్వు
కరగజేసెడు నవ్వు
పాప చల్లని నవ్వు
ఓ కూనలమ్మ
#కసరు తేనెల వంటి
కథలు కుత్తుకబంటి
నింపు కొడవటిగంటి
ఓ కూనలమ్మ
#వెన్న మీగడ పాలు
వెలది సౌందర్యాలు
బాలకృష్ణుని పాలు
ఓ కూనలమ్మ
#ఎద్దు నెక్కెను శివుడు
గెద్దపై మాధవుడు
ఘనుడు మన మానవుడు
ఓ కూనలమ్మ
# తెల్లవారల హజము
తెల్లవారుట నిజము
లేచె నీగ్రో వ్రజము
ఓ కూనలమ్మ
#కసిని పెంచే మతము
కనులు కప్పే గతము
కాదు మన అభిమతము
ఓ కూనలమ్మ
#పెరుగుచుండె అప్పు
కరుచుచుండె చెప్పు
కానుపించని నిప్పు
ఓ కూనలమ్మ
#నరము లందున కొలిమి
నాగుపాముల చెలిమి
అల్పబుద్ధుల కలిమి
ఓ కూనలమ్మ
#గడ్డిపోచలు పేని
గట్టి ఏనుగు నేని
కట్టువాడే జ్ఞాని
ఓ కూనలమ్మ
#కయ్యమాడెడి యువతి
తియ్య విలుతుని భవతి
తనకు తానే సవతి
ఓ కూనలమ్మ
#మమత పగిలే గ్లాసు
మనికి గుర్రపు రేసు
చిట్టచివరకు లాసు
ఓ కూనలమ్మ
#భార్య పుట్టిన రోజు
భర్త మరచిన రోజు
తగ్గె ననుకో మోజు
ఓ కూనలమ్మ
# ఎపుడొ పరిణయమైన
ఈడ వుండదు కాన
ఆడ దనబడె చాన
ఓ కూనలమ్మ
#సఖుని సన్నని నఖము
చంద్రబింబపు ముఖము
గిల్లినపుడే సుఖము
ఓ కూనలమ్మ
#పాదరసమును గెలుచు
పడతి చపలత వలచు
గుండెలందున నిలచు
ఓ కూనలమ్మ
#అడ్డు తగిలిన కొలది
అమిత శక్తుల గలది
అబల అగునా వెలది?
ఓ కూనలమ్మ
# కొత్తదంటే రోత
చెత్త పాతకు జోత
మనిషి ప్రగతికి ఘాత
ఓ కూనలమ్మ
# పిలువకున్నా వెళ్లి
చెరుపజాలును పిల్లి
పలు శుభమ్ముల పెళ్లి
ఓ కూనలమ్మ
# కడకు పాకిస్థాను
కలిసె చైనాతోను
మిత్రుడా! సైతాను?
ఓ కూనలమ్మ
#మంచి నడవడి లేక
మరులు ఎడదను లేక
మనిషి చేయడు రూక
ఓ కూనలమ్మ
#చెరకు రసముల వూట
చిన్మయత్వపు తేట
యోగివేమన మాట
ఓ కూనలమ్మ
#రంగు శంకల మగడు
రాజబెట్టిన నెగడు
రమణి ప్రేమకు తగడు
ఓ కూనలమ్మ
# పిలిచినప్పుడు రాదు
వెడలగొట్టిన పోదు
వనిత తీయని చేదు
ఓ కూనలమ్మ
# అజ్ఞులగు కాకవులు
అయిరి కాకాకవులు
మూసుకో నీ చెవులు
ఓ కూనలమ్మ
#పేజి పేజికి వధలు
ప్రెజలు వొల్లని కథలు
ఆరగించును చెదలు
ఓ కూనలమ్మ
#పేదలే కానిమ్ము
ప్రభువులే కానిమ్ము
చివర కవరా దుమ్ము
ఓ కూనలమ్మ
# కాలవశమున మారి
చాల ముడుపులు కోరి
దేవుడే వ్యాపారి
ఓ కూనలమ్మ
#జోలెకట్టె నవాబు
జాలిచూపె గరీబు
మూటకట్టె నవాబు
ఓ కూనలమ్మ
#చీట్ల పేకల క్లబ్బు
చివికి కొట్టెడి గబ్బు
మధ్యతరగతి లబ్బు
ఓ కూనలమ్మ
# అంతు చూసేవరకు
ఆకట! ఆంధ్రుల చురుకు
నిలువ వుండని సరుకు
ఓ కూనలమ్మ
# భర్తతోడను సీత
పట్టు పట్టుటచేత
అట్లు తగలడె రాత!
ఓ కూనలమ్మ
#మరచె చేసిన మేలు
చరచె పోరికి కాలు
వాడు చైనా పూలు
ఓ కూనలమ్మ
#మనసు కుదరని పెళ్లి
మరుదినమ్మున కుళ్లి
సుఖము హళ్లికి హళ్లి
ఓ కూనలమ్మ
#తొలుత కట్టిన బొప్పి
దొసగు వివరము చెప్పి
తొలగుజేమును నొప్పి
ఓ కూనలమ్మ
# భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామ కథయే రక్తి
ఓ కూనలమ్మ
#బహుదినమ్ములు వేచి
మంచి శకునము చూచి
బయలుళురేరఘ హా-చ్చి
ఓ కూనలమ్మ
#ఆలి కొన్నది కోక
అంతరిక్షపు నౌక
అంతకన్నను చౌక
ఓ కూనలమ్మ
# పసిడి వన్నెయ తరిగె
పన్ను లెన్నియె పెరిగె
ప్రజల వెన్నులు విరిగె
ఓ కూనలమ్మ
#వివిధ నీతులు గలవి
పెక్కు బుక్కులు చదివి
నేను చేసెద మనవి
ఓ కూనలమ్మ
#పసిడి వన్నియు తరుగు
ప్రజల కెంతో మెరుగు
పాత మౌఢ్యము విరుగు
ఓ కూనలమ్మ
#మిసిమి మెచ్చెడి తులువ
పసిడి కిచ్చును విలువ
నాకు చాలును చెలువ
ఓ కూనలమ్మ
#కొంటె బొమ్మల బాపు
కొన్ని తరములసేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మ
#అణువు గుండెను చీల్చి
అమిత శక్తిని పేల్చి
నరుడు తన్నున బాల్చి
ఓ కూనలమ్మ
#జాలి కరుణలు మాని
ఆలి నేలని వాని
జోలి కెళితే హాని
ఓ కూనలమ్మ
#నీరు యెత్తున కేగు
నిజము చాటున దాగు
నీతి నేడొక ప్లేగు
ఓ కూనలమ్మ
#తమలపాకులు నములు
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు
ఓ కూనలమ్మ
#రెండు శ్రీల ధరించి
రెండు పెగ్సు బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓ కూనలమ్మ
#పెరిగె ఇనకమ్ టాక్సు
పెరిగె సూపరు టాక్సు
టాక్సులేనిది సెక్సు
ఓ కూనలమ్మ
#తాగుచుండే బుడ్డి
తరగుచుండే కొద్ది
మెదడు మేయును గడి
ఓ కూనలమ్మ
#మనసు తెలుపని భాష
మంచి పెంచని భాష
ఉత్త సంద్రపు ఘోష
ఓ కూనలమ్మ
#కొంతమందిది నవత
కొంతమందిది యువత
కృష్ణశాస్త్రిది కవిత
ఓ కూనలమ్మ
# సన్యసించిన స్వామి
చాలినంత రికామి
చాన దొరికిన కామి
ఓ కూనలమ్మ
#లంచ మనియెడి పట్టి
మంచ మేమిటి గట్టి
ఇనుప మేకుల తొట్టి
ఓ కూనలమ్మ
#తాను మెచ్చిన కొమ్మ
తళుకు బంగరు బొమ్మ
వలపు గుడ్డి కదమ్మ
ఓ కూనలమ్మ
#ఇంటి కప్పుల నెక్కి
ఇపుడు నిజమును నొక్కి
చెప్ప మేలు హుళక్కి
ఓ కూనలమ్మ
#సగము కమ్యూనిస్టు
సగము కేపిటలిస్టు
ఎందుకొచ్చిన రొస్టు
ఓ కూనలమ్మ
#ఆశ పెరిగిన వాడు
అహము పెరిగిన నాడు
తనకు తానే కీడు
ఓ కూనలమ్మ
#గుడిని వీడెను శివుడు
గోడ రాలును చవుడు
కానడే మానవుడు
ఓ కూనలమ్మ
#మంచి గంధపు చలువ
మంట వేండ్రపు నిలువ
కుంట నున్నదె చెలువ
ఓ కూనలమ్మ
# కావ్య దుగ్ధము పితుక
కఠిన హృదయమె చితుక
ఖలుడు కూడా మెతుక
ఓ కూనలమ్మ
#పన్ను వేయని ప్రభుత
పన్ను హ్యూమరు కవిత
ప్రజల కెంతో మమత
ఓ కూనలమ్మ
# పిల్ల నిచ్చినవారి
పీకమీద సవారి
చేయూ అల్లుడె మారి
ఓ కూనలమ్మ
#పెద్ద జంతువు దంతి
వెడద దంతుల దొంతి
సమము ఒక్క వదంతి
ఓ కూనలమ్మ
#ఈసు కన్నుల దోయి
చూచు చెడుపుల వేయి
గుడ్డి ప్రేమే హాయి
ఓ కూనలమ్మ
#నీవు పలికిన రీతి
నేను పాడెద నీతి
నీకు చెందుత ఖ్యాతి
ఓ కూనలమ్మ
#రాక్షసత్వము పోయి
రాచరికములు పోయి
ప్రజలదే పైచేయి
ఓ కూనలమ్మ
#పొరుగు దేశము లిచ్చు
పుల్ల ఇజముల మెచ్చు
మూర్ఖ మెప్పుడు చచ్చు
ఓ కూనలమ్మ
#పొరుగు పొలముల హద్దు
పరుల రాజ్యపు హద్దు
దాటువాడే మొద్దు
ఓ కూనలమ్మ
#చిన్ని పాదము లందు
చివరి ప్రాసల చిందు
చేయు వీనుల విందు
ఓ కూనలమ్మ
#జాతి ఛందము లోన
నీతి చెప్పెడు జాణ
మీటు హృదయపు వీణ
ఓ కూనలమ్మ
# పెను సమాసము లున్న
పెద్ద వృత్తముకన్న
చిన్న పదమే మిన్న
ఓ కూనలమ్మ
#పరుల మేరును కోరి
పదము లల్లెడువారి
పథము చక్కని దారి
ఓ కూనలమ్మ
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కూనలమ్మ_పదాలు" నుండి వెలికితీశారు