ఇల్లాలి ముచ్చట్లు (శీర్షిక): కూర్పుల మధ్య తేడాలు

మరికొంత విస్తరణ
పంక్తి 1:
[[బొమ్మ:ILLALI MUTCHATLU_PURANAM SEETA_1.jpg|150px|left|thumb|ఇల్లాలి ముచ్చట్లు వ్యాస సంపుటి ముఖ చిత్రం]]
[[బొమ్మ:ILLALI MUTCHATLU_PURANAM SEETA_2.jpg|150px|right|thumb|ఇల్లాలి ముచ్చట్లు వ్యాస సంపుటి ముఖ చిత్రం]]
'''ఇల్లాలి ముచ్చట్లు''' ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, [[ఆంధ్రజ్యోతి]] వార పత్రికలో. [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] ఆ పత్రికకు సంపాదకునిగా ఉన్న రోజులలో ఈ శీర్షికను 1967వ సంవత్సరంలో మొదలు పెట్టారు. ఈ శీర్షికను "[[పురాణం సీత]]" నిర్వహించేవారు. అందరూ ఈ శీర్షికను [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] సతీమణి వ్రాస్తున్నదని చాలా కాలం అనుకునేవారట. కాని, సుబ్రహ్మణ్య శర్మే, మహిళా రచనా శైలిని అనుకరిస్తూ చాలా కాలం ఎవరికీ అంతు చిక్కకుండా నిర్వహించారు. దీనికి కారణం, శీర్షిక పేరు మహిళా సంబంధమయి, రచయిత పురుషుడయితే పాఠకులు ఆదరించరేమో అన్న అనుమానం ఒకటి కాగా, అప్పటి రోజులలో, మహిళా రచయితలదే పైచేయి అవుతూ వారి రచనలే ప్రసిద్ధి చెంది ఉండటం మరొక కారణం కావచ్చును. [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడయిన తరువాత కూడ తన బాధ్యతలను నిర్వహిస్తూనే, ఈ శీర్షికను కూడ విజయవంతంగా కొనసాగించారు.
 
 
ఈ శీర్షికలో మనం రోజువారి చూసే సంఘటనలు, రాజకీయాలు, తగాదాలు, చిన్న పిల్లల ఆటలు వంటి విషయాల గురించి (చైనా రాజకీయాల దగ్గరనుంచి చీపురు కట్టవరకు) హాస్యభరితంగా, ఆహ్లాదకరంగా వ్రాశేవారువ్రాస్తూనే అవసరమైనప్పుడు, అవసరమైన చోట సునిసితమైన విర్శదగ్గర నుండి, కత్తుల్లాంటి మాటలతో తీవ్ర విమర్శకూడా చేస్తూండేవారు. చక్కటి పొందికతో ఎక్కడా కూడ తూకం చెడకుండా, ఈ శేర్షిక ప్రతి వారం ఒక పేజీ మాత్రమే ప్రచురించేవారు.
 
==ఇల్లాలి ముచ్చట్లు చిహ్నం (LOGO)==