మంత్రాలయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:MRO Office, Mantralayam.jpg|thumb|తహశీల్దారు కార్యాలయం, మంత్రాలయం|250x250px]]
'''మంత్రాలయం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన పట్టణం. [[ద్వైతము|మధ్వాచార్యుల]] పరంపరలో ధృవనక్షత్ర సమానమైన [[రాఘవేంద్రస్వామి]]వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం [[తుంగభద్రా]] నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది [[కర్నూలు]] నుండి 100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు ఉన్నాయి. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
'''మంత్రాలయం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన పట్టణం. పిన్ కోడ్: 518345.
[[ద్వైతము|మధ్వాచార్యుల]] పరంపరలో ధృవనక్షత్ర సమానమైన [[రాఘవేంద్రస్వామి]]వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం [[తుంగభద్రా]] నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది [[కర్నూలు]] నుండి 100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు ఉన్నాయి. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
 
2009 [[అక్టోబరు 2]]<nowiki/>న, [[2009]]న [[తుంగభద్ర నది]] ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానికి వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009</ref>
== మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ==
[[ఫైలు:Mantralayam1.jpg|right|thumb|300px250x250px|రాఘవేంద్ర స్వామి ఆలయం ప్రవేశం వద్ద]]
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.
అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్‌ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట! త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడుగంటలపాటు విశ్రాంతినిచ్చిందని.. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు.
Line 51 ⟶ 50:
మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఇవికాక కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్‌హౌస్‌ల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి.
అదనపు సమాచారం: రూ. 8 వేల నుంచి రూ. 2లక్షల వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు. ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
 
మరిన్ని వివరాలకు... www.srsmatha.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దీంతోపాటు సేవలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఇ-మెయిల్‌ ఐడీ: info@srsmat.org ఫ్యాక్స్‌ నెంబర్‌: 08512-279889
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{మంత్రాలయం మండలంలోని గ్రామాలు}}
== వెలుపలి లంకెలు ==
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
"https://te.wikipedia.org/wiki/మంత్రాలయం" నుండి వెలికితీశారు