మంత్రాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
2009 [[అక్టోబరు 2]]<nowiki/>న, [[తుంగభద్ర నది]] ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానికి వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009</ref>
== మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ==
[[File:Ragavendratemple.jpg|thumb|Mantralayam temple|250x250px]]
[[ఫైలు:Mantralayam1.jpg|thumb|250x250px|రాఘవేంద్ర స్వామి ఆలయం ప్రవేశం వద్ద]]
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ.
"https://te.wikipedia.org/wiki/మంత్రాలయం" నుండి వెలికితీశారు