నిడదవోలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: copy edit
పంక్తి 27:
[[బొమ్మ:Dasanjaneya swami devasthanam nidadavole.JPG|thumb|దాసాంజనేయ స్వామి దేవాలయం]]
నిడదవోలును వ్యవసాయపరంగా ఆదుకొనేది [[విజ్జేశ్వరం]] గుండా [[గోదావరి]] నది నుంచి వచ్చే ముఖ్యమైన కాలువ. ఇది నిడదవోలు గుండా ప్రవహిస్తూ వరిచేలకు నీరు అందిస్తోంది. నిడదవోలులో ఈ కాలువ ఒడ్డున కల ప్రాంతాన్ని చినకాశిరేవు అని పిలుస్తారు. చినకాశిరేవులో ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. [[గ్రామదేవత]] అయిన నంగాలమ్మ గుడికుడా చినకాశిరేవులో ఉంది.
 
1970కు ముందు నిడదవోలుకు [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లాలో ప్రముఖపాత్ర ఉండేది. గోదావరి పై రైలురోడ్డు వంతెన ([[కొవ్వూరు]]కి [[రాజమహేంద్రవరం]]), [[సిద్ధాంతం|సిద్దాంతంవంతెన]] ([[రావులపాలెం]] దగ్గర నిర్మించబడ్డాక పట్టణ అభివృద్ధి కుంటు పడింది. [[తణుకు]], [[తాడేపల్లిగూడెం]] బాగా అభివృద్ధి చెంది [[పశ్చిమ గోదావరి|పశ్చిమగోదావరి]] జిల్లాలో ప్రాముఖ్యత సంపాదించుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రముఖ వాణిజ్యాపట్టణంగా వెలసినా, ఈ మధ్య [[రాజమహేంద్రవరం ]], [[తణుకు]],, తాడేపల్లిగుడెంలు అభివృద్ధి చెందినట్లుగా నిడదవోలు అభివృద్ధి చెందక కొద్దిగా వెనకబడింది. నగర అభివృద్ధికి రవాణాను ముఖ్య వీధికి రాకుండా చేసిన రైల్వే ఒవర్ బ్రిడ్జ్ హస్తం కూడా ఉంది.
 
===నిడదవోలు రైల్వే కూడలి===
[[బొమ్మ:Nidadavole rly junction.jpg|thumb|నిడదవోలు రైలు స్టేషను]]
నిడదవోలు రైల్వే [[కూడలి]] అవ్వడం వలన చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇక్కడకు ఉత్తరాన [[విశాఖపట్నం]] నుండి రాజమండ్రి మీదగా వచ్చే లైను రెండుగా విడి పోయి మళ్ళీ [[విజయవాడ|విజయవాడలో]] కలుసుకుంటాయి. అందులో ఒకటి [[ఏలూరు]] మీదగా, రెండవది తణుకు, భీమవరాల మీదగా వెళతాయి. ఇక్కడ కంప్యూటరీకృత టికెట్ బుకింగ్ కూడా ఉంది. ప్రముఖ రైళ్ళు చాలా ఇక్కడ ఆగుతాయి.
.
===రైల్వే ఓవర్ బ్రిడ్జి===
రైలు లైను, [[కాలువ]] ట్రాఫిక్ రాకపోకలకు అడ్డుపడుతున్నాయని, వాటిరెండిటి మీదగా [[1992]]లో వంతెన నిర్మించడం జరిగింది. దాని పిదప వాహన సంచారం గణేశ్ చౌక్ మరియి పాటి మీదగా మళ్ళించడం జరిగింది. దాని మూలంగా వ్యాపారాలన్నీ అటువైపు మారి, ఒకప్పటి ముఖ్యప్రాంతాలయిన బస్సు స్టాండు, నెహ్రూ బొమ్మ వెనకబడిపోయినవి.
 
===నిడదవోలు వార్ఫ్===
[[బొమ్మ:Nidadavole wharf.JPG|thumb|నిడదవోలు వారఫ్]]
రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ రాకముందు, నిడదవోలు వారఫ్ నుండి పడవలపై ప్రయాణం చురుకుగా సాగేది. రైలు ప్రయాణం వచ్చిన తరువాత కూడా నిడదవోలు వరకూ పడవమీద వచ్చి అక్కడనుండి రైలు ఎక్కేవారు. రోడ్డు రవాణా వచ్చిన తరువాత, వారఫ్ వాడుక పూర్తిగా తగ్గిపోయింది. ఆ వారఫ్ నెహ్రూ బొమ్మకు ఎదురుగా ఉంది.
===నిడదవోలు సంత (మార్కెట్)===
నిడదవోలులోని ముఖ్య వ్యాపార దుకాణాలన్నీ సంత మార్కెట్ దగ్గర ఉండేవి. సంత మునిసిపల్ కార్యాలయం దగ్గర ఉండేది. ఇప్పుడు దానిని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరున్న అంబేద్కర్ బొమ్మ ప్రాంతానికి తరలించారు.
 
===నిడదవోలు సంత (మార్కెట్)===
నిడదవోలులోని ముఖ్య వ్యాపార దుకాణాలన్నీ సంత మార్కెట్ దగ్గర ఉండేవి. సంత మునిసిపల్ కార్యాలయం దగ్గర ఉండేది. ఇప్పుడు దానినితరువాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరున్న అంబేద్కర్ బొమ్మ ప్రాంతానికి తరలించారు.
 
==ముఖ్యమైన కూడళ్ళు==
"https://te.wikipedia.org/wiki/నిడదవోలు" నుండి వెలికితీశారు