అంకుర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:Ankur film poster.gif as it is deleted
ట్యాగు: మానవిక తిరగవేత
 
పంక్తి 18:
'''అంకుర్''' (హిందీ: अंकुर, ఉర్దూ: اَنکُر, అనువాదం: అంకురం) 1974 నాటి హిందీ చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు [[శ్యాం బెనగళ్]] తీసిన మొదటి చలనచిత్రం, అలానే అనంత్ నాగ్, షబానా ఆజ్మీ వంటి నటీనటుల తొలి చిత్రం.
== ఇతివృత్తం ==
పుట్టుకతో మాటలు రాని, వినిపించని కిష్టయ్య (అనంత్సాధూ నాగ్మెహర్) కుమ్మరి. అతని భార్య లక్ష్మి ([[షబానా అజ్మీ]]) ఊరి కామందు సూర్య (అనంత్ నాగ్) దగ్గర పనిచేస్తూంటుంది. కుండలు, ఇతర వస్తువులు మట్టితో తయారుచేసి అమ్ముకునే అతనికి అల్యూమినియం పాత్రలు మార్కెట్లోకి రావడంతో పని పోయింది. చేసే వృత్తి పాడైపోవడంతో తాగుడుకు బానిసగా మారిపోయిన భర్తను సరిజేసుకునేందుకు తన యజమానికి చెప్పి అతని వద్ద బండితోలే పనిలో పెడుతుంది లక్ష్మి. అప్పటికే తాగుబోతుగా తయారు కావడంతో రాబడికి మించి తాగుతూ, చివరకి కల్లు దొంగతనం చేస్తూ దొరికిపోతాడు కిష్టయ్య. దొంగతనం చేసినందుకు తల గొరిగి వదిలిపెట్టడంతో, ఆ అవమానంతో ఊళ్ళో తిరగలేక కిష్టయ్య ఊరొదిలి పారిపోతాడు.<br />
భర్త వదిలిపెట్టిన స్త్రీ కావడం, అమాయకురాలు కావడం, వెనుకబడ్డ వర్గానికి చెందివుండడం వంటి కారణాలతో నిస్సహాయురాలైన లక్ష్మిని

సూర్య లొంగదీసుకుంటాడు. అతని వల్ల గర్భం రావడంతో తన మర్యాదకు భంగమౌతుందని భయపడి తీయించుకోమని బెదిరిస్తాడు. ఐతే ఆమె కడుపుతీపితో ఆ పనిచేయడానికి వ్యతిరేకించడంతో కోపగించుకుంటాడు. యజమాని భార్య కాపురానికి రావడంతో లక్ష్మిపై దొంగతనం నేరం మోపి పనిలోంచి తీసేస్తాడు. నిండు గర్భంతో ఉన్న లక్ష్మి తిండి, ఆలనా పాలనా చూసుకునే తోడు లేక ఒంటరిగా మిగిలిపోతుంది.<br />
ఇంతలో హఠాత్తుగా కిష్టయ్య తిరిగి వస్తాడు. లక్ష్మి గర్భవతి కావడాన్ని చూసి చాలా సంతోషపడతాడు. భార్యని, పుట్టబోయే బిడ్డనీ చూసుకునేందుకు యజమానిని వేడుకుని బండి తోలే పని అడిగేందుకు బయలుదేరుతాడు. ఐతే వస్తున్న కిష్టయ్య చేతిలోని కర్ర, బిగించి కట్టిన తలపాగా, వచ్చే వేగం చూసి తాను అతనికి చేసిన ద్రోహానికి కొడదామనే వస్తున్నాడని యజమాని సూర్య అనుమానిస్తాడు. భయపడి అతని కన్నా ముందుగానే కొరడా తీసుకుని అతన్ని చావబాదడం ప్రారంభిస్తాడుచావబాదుతాడు. ఇది లక్ష్మి, పాలేర్లు, ఆడుకుంటున్న పిల్లలు చూస్తున్నా వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటూ ఊరుకుంటారు. ఆఖరికి ఓ చిన్న పిల్లాడు చాటుగా రాయి తీసుకుని, యజమాని ఇంటిమీదికి విసురుతాడు. ఆ ఇంటి కిటికీ అద్దం భళ్ళున బద్దలవడంతో సినిమా ముగుస్తుంది.<ref name="బాలీవుడ్ క్లాసిక్స్">{{cite book|last1=మహమ్మద్|first1=ఖదీర్ బాబు|title=బాలీవుడ్ క్లాసిక్స్|date=2010|publisher=కావలి ప్రచురణలు|location=హైదరాబాద్|pages=56 - 58|edition=1|chapter=వ్యవస్థ గర్భంలో చైతన్యబీజం అంకుర్}}</ref>
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
"https://te.wikipedia.org/wiki/అంకుర్_(సినిమా)" నుండి వెలికితీశారు