→‎వికీలో తటస్థత: కొత్త విభాగం
పంక్తి 18:
 
:కుమారశర్మ గారూ, వికీ అభిప్రాయవేదిక కాదు. ప్రాపగాండా సాధనం అంతకంటేనూ కాదు. మీరు సృష్టిస్తున్న వ్యాసాలతో వ్యక్తిగతంగా నాకే ఇబ్బందీ లేదు కానీ అందులో సొంత అభిప్రాయాలు, మూలాలు ఉదహరించని వ్యాఖ్యలు వికీలో చెల్లవు. మూలాలంటే కాస్త విశ్వజనీయమైనవి, ప్రధానస్రవంతి పత్రికలో ప్రచురించనవై ఉండాలి. మీరు వెబ్‌సైటు చక్కగా ఉంది. ఒక బ్లాగు ప్రారంభించి [http://koodali.org కూడలి]లో పెట్టుకుంటే నలుగురు వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. చాలామంది సభ్యులకు, నిర్వాహకులకు మీరు వ్రాసే వ్యాసాలు వికీకి తగవు అనిపించింది. తటస్థతను గాలికి వదిలేసి, ఇష్టం వచ్చిన సొంత అభిప్రాయాలను ఇలాగే వ్రాస్తూ ఉంటే మిమ్మల్ని నిషేధించకుండా నేను ఆపలేను. వికీ ప్రజాస్వామ్యమని ఎక్కడా చెప్పుకోలేదు [[WP:NOT]] చదవండి. ఇంతకుముందు మీ ఐపీ అడ్రసులను నిషేధించాము. అయినా నిషేధాన్ని మీరు లెక్కచేయకుండా సాక్‌పప్పెట్సును తయారుచేసుకొని తిరిగి ప్రవేశించడం ఏమీ బాగోలేదు. Gummanagaraju, Gangajalam మీరేనని ఋజువైంది. --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 22:15, 8 డిసెంబర్ 2008 (UTC)
:[[వికీపీడియా:ఐదు మూలస్తంభాలు]] లో ఈ పేరా చదవండి. వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం. --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 22:17, 8 డిసెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarsarma" నుండి వెలికితీశారు