మాయలోడు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
→‎కథ: శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
 
== కథ ==
అప్పలకొండ అనే వ్యక్తి ఆస్తిపరులైన తన చెల్లెలు కుటుంబాన్ని చంపి వాళ్ళ ఆస్థిని స్వాధీనం చేసుకోవాలనుకుంటూ ఉంటాడు. అప్పలకొండ దాడిలో అతని చెల్లెలు, బావ చనిపోయినా, అతని మేనకోడలు చిన్నపాప మాత్రం అతన్నుంచి తప్పించుకుని పారిపోతుంది. వీరబాబు గారడీ చేసుకుని జీవితం వెళ్లబుచ్చుతూ ఉంటాడు. అతనికి గుండు అనే స్నేహితుడు, ఓ బామ్మ (నిర్మలమ్మ) తోడుగా ఉంటారు. తప్పించుకువచ్చిన పాపఅప్పలకొండ మేనకోడలు వీరబాబు చెంతకు చేరుతుంది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న వీరబాబు ఆమెను తన దగ్గర ఉంచుకుని పోషిస్తుంటాడు. పాప కోరిక మేరకు ఆమెకు గారడీ నేర్పిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చూపు కోల్పోతుంది. తిరిగి ఆమెకు చూపు తెప్పించడానికి కొంత సొమ్ము అవసరమవుతుందని డాక్టరు చెబుతాడు. అందుకోసం తన ఖర్చులు తగ్గించుకుని ఆమె శస్త్రచికిత్స కోసం పైసా పైసా కూడబెట్టి పద్మనాభం దగ్గర దాచి పెడుతుంటాడు. పద్మనాభం కూతురు సిరి, అల్లరిపిల్ల. తన స్నేహితులని వెంటేసుకుని తిరుగుతూ అందరినీ ఆట పట్టిస్తుంటుంది. వీరబాబును కూడా ఒకసారి అలా ఆటపట్టిస్తుంది. కానీ అతని మంచి మనసు తెలుసుకుని అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.
 
తప్పి పోయిన పాప వీరబాబు ఇంట్లో ఉందని తెలుసుకున్న అప్పలకొండ ఆమెను తనకు అప్పగించమని కోరతాడు. దానికి వారు అంగీకరించకపోవడంతో వీరబాబు మీద కక్ష కడతాడు. పాప ఆపరేషన్ కోసం అనుకున్నంత ధనం సమకూరడంతో దానిని తీసుకోవడం కోసం పద్మనాభం దగ్గరికి వెళతాడు వీరబాబు. తన కూతురు వీరబాబును ప్రేమిస్తుందని ముందే తెలుసుకున్న ఆయన తన కూతురు అతన్ని మరిచిపోయేదాకా డబ్బులు ఇవ్వనని నిరాకరిస్తాడు. వీరబాబు కోపంతో ఆయన నోట్లో గుడ్డలు కుక్కి కత్తితో బెదిరించి కూర్చీకి కట్టేసి తన డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. చాటునుంచి ఇదంతా గమనిస్తున్న అప్పలకొండ ఆ మిగతా డబ్బును కూడా కాజేసి కత్తితో పద్మనాభాన్ని హత్య చేసి ఆ నేరాన్ని వీరబాబు మీద వేస్తాడు. వీరబాబు జైలుకి వెళతాడు. పాపకు ఆపరేషన్ ఆగిపోతుంది. కానీ పాపను జాగ్రత్తగా ఒక చోట దాచిపెడతాడు. ఈలోగా అప్పలకొండ తన రౌడీలని పంపించి పాపను చంపించాలని చూస్తాడు. కానీ వీరబాబు తన మాయలతో వారిని అడ్డుకుంటాడు. చివరికి వీరబాబు అప్పలకొండని తన ఇంద్రజాలంతో ముప్పుతిప్పలు పెట్టించి అతని చేత న్యాయస్థానంలో నిజం చెప్పించి నిర్దోషిగా విడుదలవుతాడు. పాపకు కూడా ఆపరేషన్ పూర్తై కంటి చూపు తిరిగి వస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మాయలోడు" నుండి వెలికితీశారు