అయ్యంకి వెంకటరమణయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: మానవిక తిరగవేత చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
 
==జీవిత విశేషాలు==
ఆయన[[తూర్పు గోదావరి]] జిల్లా [[రామచంద్రపురం]] తాలూకా [[అనపర్తి]] నియోజక వర్గంలోని [[బిక్కవోలు]] మండంలో ఉన్న [[కొంకుదురు]] గ్రామంలో [[1890]] జూలై 24న జన్మించాడు.<ref>మన గ్రంథాలయ సేవానిరతులు, వెలగా వెంకటప్పయ్య, పేజీ.23</ref> వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, మంగమాంబ.వీరి తండ్రి శ్రీ వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన [[అయ్యంకి]]లో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. వెంకటరమణయ్య గారు [[విజయవాడ]]లో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారంతో అనుబంధం పెంచుకొని, ఆ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యారు. 1341934-48 మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతములో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 1972 లో [[పద్మశ్రీ పురస్కారం]] అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. వీరు 1979, మార్చి-7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన మనుమడు ఆచార్య డా.వెంకటమురళీకృష్ణ, విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన స్వగ్రామంలో "అయ్యంకి" పేరిట ఒక [[గ్రంథాలయం]] నెలకొల్పాలని, స్థానికుల అభిలాష.
 
శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారు, దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించారు. తన 19వ ఏటనే శ్రీ బిపిన్ చంద్రపాల్ గారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజాసేవ వైపు అడుగిడినారు. 1910 లో బందరులో "ఆంధ్ర సాహిత్య పత్రిక"ను స్థాపించి, [[గురజాడ]], [[రాయప్రోలు]], [[శ్రీశ్రీ]] రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1914లో ప్రథమ ఆంధ్ర రాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను [[విజయవాడ]]లో నిర్వహించారు. 1919, నవంబరు-14న, [[చెన్నై]]లో తొలి "అఖిలభారత పౌర గ్రంథాలయం"ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఆ రోజును, 1968 నుండి, "జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినం"గా జరుపుకొనుచున్నారు. వీరు అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, "ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం" అని చాటి చెప్పారు.