జిల్లా కోర్టులు (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాహ్య లింకులు: AWB తో వర్గం చేర్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
పంక్తి 1:
[[భారత దేశం|భారత దేశంలోని]] జిల్లా కోర్టులు అనేవి, [[జిల్లా|జిల్లాలలోని]] కేసుల సంఖ్య, జనాభా పంపిణీ పరిగణనలోకి తీసుకొని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలకు కలిపి, లేదా ప్రతి జిల్లాకు ఏర్పాటైన జిల్లా ప్రధాన న్యాయస్థానాలు. ఇవి జిల్లా స్థాయిలో న్యాయ నిర్ణయాలు చేస్తాయి.జిల్లా న్యాయాధిపతి న్యాయస్థానం ప్రతి జిల్లాకు అత్యున్నత న్యాయస్థానంగా పరిగణిస్తారు.ఇది పౌరులకు సంబంధించిన విషయాలలో ప్రధానంగా దాని అధికార పరిధిని రాష్ట్ర [[భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితా|హైకోర్టుతో]] పాటు సరియైన పౌరవిషయాలపై అధికార పరిధిని ఉన్నత న్యాయస్థానం పౌరవిధాన నియమావళి నుండి పొందింది. నేరస్వభావాల విషయాలపై కూడా [[క్రిమినల్ ప్రొసీజర్ కోడ్|నేరచట్టం]] కింద తన అధికార పరిధిని ఉపయోగించి, జిల్లా న్యాయస్థానాలు న్యాయనిర్ణయాలు తీసుకుంటాయి.ఆ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సలహాతో,  ఆ రాష్ట్ర గవర్నర్ నియమించిన జిల్లా న్యాయమూర్తి ఆ జిల్లా కోర్టుకు అధ్యక్షత వహిస్తాడు.జిల్లా [[న్యాయమూర్తి]] పనిభారాన్ని బట్టి అతనితోబాటు, అదనపు జిల్లా న్యాయమూర్తులును, అసిస్టెంట్ జిల్లా న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది..జిల్లా న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయమూర్తికి ఉన్న సమానమైన అధికారపరిధి, అదనపు జిల్లా న్యాయమూర్తికి కూడా ఉంటుంది.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20130122225727/http://indiancourts.nic.in/districtcourt.html|title=District Courts of India|date=2013-01-22|website=web.archive.org|access-date=2020-10-07|archive-date=2013-01-22|archive-url=https://web.archive.org/web/20130122225727/http://indiancourts.nic.in/districtcourt.html|url-status=bot: unknown}}</ref>
 
ఏదేమైనా, అదనపు, సహాయ జిల్లా న్యాయమూర్తులపై, వారి పని కేటాయింపులపై నిర్ణయాలతో సహా, పర్యవేక్షక నియంత్రణను జిల్లా న్యాయమూర్తి కలిగిఉంటారు.పౌర విషయాలకు అధ్యక్షత వహించేటప్పుడు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిని తరచుగా "జిల్లా న్యాయాధిపతి" అని, నేర విషయాలకు అధ్యక్షత వహించేటప్పుడు "సెషన్స్ న్యాయాధిపతి" అని పిలుస్తారు.<ref>https://indiankanoon.org/doc/978569/</ref> జిల్లా స్థాయిలో అత్యున్నత న్యాయాధిపతి కావడంతో, జిల్లాలో న్యాయవ్యవస్థ అభివృద్ధికి కేటాయించిన రాష్ట్ర నిధులను జిల్లా న్యాయాధిపతికి నిర్వహించే అధికారం కూడా కలిగిఉంటాడు.