తులసి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: అయోమయ నివృత్తి లింకులు
పంక్తి 48:
జలుబు, దగ్గు లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడతాం. ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రల కన్నా.. కొన్ని తులసి ఆకుల్ని నమిలి చూడండి. వాటివల్ల జలుబు, దగ్గు మాత్రమే కాదు, మరికొన్ని సమస్యలూ అదుపులోకి వస్తాయి.
* తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో వచ్చే పలు ఇన్‌ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. చిన్నారులకు తులసి అలవాటు చేయడం చాలా మంచిది.
* ఈ కాలంలో [[జలుబు]], దగ్గు ఎక్కువగా బాధిస్తాయి. అలాంటప్పుడు తులసి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రకరకాల వైరస్‌లూ దూరం అవుతాయి. ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవు. జలుబు త్వరగా తగ్గుతుంది.
* దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి అందులో తేనె, కొద్దిగా మిరియాలపొడి కలిపి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిళ్లు దగ్గు బాధించదు. తొందరగా అదుపులోకి వస్తుంది.
* అలర్జీలు ఉన్నవారు తేనె, తులసి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికం. చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి. తులసి ఆకుల రసాన్ని ముఖం రాయడం వలన ముఖం వెంటనే చల్లగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు