రోగ నిర్ణయ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
===స్థూల రోగ నిర్ణయ శాస్త్రము===
[[Image:Rudolf Virchow.jpg|thumb|250px|రుడాల్ఫ్ విర్కో.]]
వివిధ వ్యాధుల్ని ఒక పద్ధతి ప్రకారం డిసెక్షన్ ద్వారా పరీక్షించడం పునరుజ్జీవనానికి పూర్వం తెలియదు. ఇలా డిసెక్షన్ ద్వారా వ్యాధి కారణాన్ని మొదటగా గుర్తించింది ఇటాలియన్ [[ఆంటోనియో బెనివైనీ ]] (1443-1502). అయినా ఇందులో గ్రాస్ పెథాలజిస్ట్ [[జియోవనీ మోర్గాగ్నీ]] (1682-1771) ప్రసిద్ధిచెందిన వ్యక్తి. ఇతని రచన "De Sedibus et Causis Morborum per Anatomem Indagatis" 1761 లో ప్రచురించబడినది. ఇందులో సుమారు 600 పైగా ఆటాప్సీలు చేసి వాటి వివరాలు మరణానికి ముందు రోగుల వ్యాధి లక్షణాలతో పోల్చబడ్డాయి. అప్పటికే సామాన్యమైన అనాటమీ బాగా అబివృద్ధిచెందింది. అయినా డె సెడిబస్ మొదటిసారిగా వ్యాధులలో వచ్చే తేడాలను వ్యాధులకు పోల్చాడు. 19వ శతాబ్దంలో ఇది బాగా పరిణతి చెంది అప్పటికి తెలిసిన అన్ని వ్యాధుల గ్రాస్ అనాటమీ వివరాలు తెలిసాయి. అతి విస్తృతంగా పరిశోధన చేసి [[కార్ల్ రోకిటాన్స్కీ]] (1804-1878) 20,000 ఆటాప్సీలు జరిపాడు.
 
===సూక్ష్మ రోగ నిర్ణయ శాస్త్రము===
[[Image:Rudolf Virchow.jpg|thumb|250px|రుడాల్ఫ్ విర్కో.]]
జర్మనీ వైద్యుడు [[రుడాల్ఫ్ విర్కో ]] (Rudolf Virchow) (1821-1902) సూక్షశాస్త్ర పితామహునిగా పేర్కొంటారు. అప్పటికి [[సూక్ష్మదర్శిని]] కనుగొని 150 సంవత్సరాలైనా, విర్కో మొదటిసారిగా వ్యాధి లక్షణాల్ని కణాలలోని మార్పులతో పోల్చాడు. ఇతని శిష్యుడు [[జూలియస్ కాన్హీమ్ ]] (Julius Cohnheim) (1839-1884) సూక్ష్మమైన మార్పులను ప్రయోగశాలలో [[ఇన్ఫ్లమేషన్]] గురించి పరిశోధించాడు. ఇతడు [[ఫ్రోజెన్ సెక్షన్]] (Frozen section) పద్ధతిని ప్రారంభించాడు. ఇది ఆధునిక కాలంలో [[శస్త్రచికిత్స]] సమయంలోనే రోగనిర్ధారణ చేసే అవకాశం కలిగింది.
 
==ఆధునిక రోగ నిర్ణయ శాస్త్రము==
 
ఆధునిక పరిశోధన పద్ధతులైన [[ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని]] (Electrom Microscope), [[ఇమ్యునో హిస్టో కెమిస్ట్రీ]] (Immunohistochemistry) మరియు [[మోలెక్యులర్ జీవశాస్త్రం]] (Molecular Biology) విస్తృతంగా అభివృద్ధి చెంది వీటిని వ్యాధుల నిర్ధారణ మాత్రమే కాకుండా మరెన్నో క్లిష్టమైన నిర్ణాయాల్ని తీసుకోవడంలో ఉపయోగపడుతున్నది. బాగా విస్తృతమైన భావంతో చూస్తే పరిశోధనలన్నీ కణాలు, కణజాలాలు మరియు అవయవాలలో జరిగే మార్పులన్నీ పేథాలజీ విభాగంలోనే ఉన్నాయి.