ఇల్లాలి ముచ్చట్లు (శీర్షిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:ILLALI MUTCHATLU_PURANAM SEETA_1.jpg|150px|left|thumb|ఇల్లాలి ముచ్చట్లు వ్యాస సంపుటి ముఖ చిత్రం]]
[[బొమ్మ:ILLALI MUTCHATLU_PURANAM SEETA_2.jpg|150px|right|thumb|ఇల్లాలి ముచ్చట్లు వ్యాస సంపుటి ముఖ చిత్రం]]
'''ఇల్లాలి ముచ్చట్లు''' ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, [[ఆంధ్రజ్యోతి]] వార పత్రికలో. ఈ శీర్షికను 1967వ సంవత్సరంలో మొదలు పెట్టారు. ఈ శీర్షికను "[[పురాణం సీత]]" నిర్వహించేవారు. అందరూ ఈ శీర్షికను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] సతీమణి వ్రాస్తున్నదని చాలా కాలం అనుకునేవారట. కాని, సుబ్రహ్మణ్య శర్మే, మహిళా రచనా శైలిని అనుకరిస్తూ చాలా కాలం ఎవరికీ అంతు చిక్కకుండా నిర్వహించారు. దీనికి కారణం, శీర్షిక పేరు మహిళా సంబంధమయి, రచయిత పురుషుడయితే పాఠకులు ఆదరించరేమో అన్న అనుమానం ఒకటి కాగా, అప్పటి రోజులలో, మహిళా రచయితలదే పైచేయి అవుతూ వారి రచనలే ప్రసిద్ధి చెంది ఉండటం మరొక కారణం కావచ్చును. [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడయిన తరువాత కూడ తన బాధ్యతలను నిర్వహిస్తూనే, ఈ శీర్షికను కూడ విజయవంతంగా కొనసాగించారు.