జయగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==నాస్తిక యుగం పత్రిక==
నాస్తిక యుగం పత్రిక 1972లో డా.జయగోపాల్ గారిచే స్థాపించబడినది. ఈ పత్రిక విశాఖపట్నం నుంచి ప్రచురితమవుతోంది. ఈ పత్రికలో హిందూ, ఇస్లాం మరియు క్రైస్తవ మతాల పైన తీవ్ర విమర్శలు ప్రచురించారు. గ్రామాలలో [[చేతబడి]] పేరుతో జరిగే హత్యలు, మానభంగాల పై కూడా వార్తలు ప్రచురించారు.
 
==భారత నాస్తిక సమాజం==
భారత నాస్తిక సమాజం వారు మతతత్వానికి వ్యతిరేకంగా సభలు పెడుతున్నారు. మతతత్వ సంస్థలకి వ్యతిరేకంగా పాటలు కూడ సంకలనం చేస్తున్నారు. "ఓరోరి మతోన్మాది, నీకు కడతాం గోరీ" వంటి పాటలు మతతత్వ రాజకీయ పార్టీలని భయపెట్టేలా ఉంటాయి. గ్రామాలలో మంత్ర గాళ్ళు దెయ్యాలు తిరుగుతున్నాయని పుకార్లు సృష్టించి ప్రజలని భయపెట్టి వాటిని శాంతి చెయ్యిస్తామని చెప్పి డబ్బులు లాగుతున్నారు. ఆ సందర్భాలలో భారత నాస్తిక సమాజం వారు గ్రామాలకి వెళ్ళి భయాల్ని పోగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
==సవాళ్ళు==
"https://te.wikipedia.org/wiki/జయగోపాల్" నుండి వెలికితీశారు