వాడుకరి చర్చ:Nrahamthulla/పాత చర్చ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 212:
*రహంతుల్లా గారు, మీ జీవితగమ్యాన్ని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి గొప్పవారు ప్రతీ మతంలోనూ ఉన్నారు. మీలాంటి నిజమైన హేతువాదుల్ని అందరం గుర్తించాలి. అభినందనలు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 07:41, 13 డిసెంబర్ 2008 (UTC)
 
మతానికి హేతువాదానికి మధ్య ఏమాత్రం పొంతన కుదరదు. నేను హిందూ కుటుంబంలో పుట్టాను. పల్లె ప్రాంతాలలో కొంత మంది హిందువులు భర్త చనిపోయిన స్త్రీలకి గుండు గియ్యించి తెల్ల చీర కడతారు. ముస్లింలు స్త్రీల చేత బురఖాలు వెయ్యించడం కూడా అలాంటిదే. ముహమ్మదే తన భార్యల చేత బురఖాలు వెయ్యించినప్పుడు ఇక సాధారణ ముస్లిం భక్తుడు బురఖాల విషయంలో సంస్కరణలు తెస్తాను అని అంటే అతను ముహమ్మద్ గురించి, ఇస్లాం గురించి తెలియని వాడనుకోవాలి. ఉత్తర అమెరికాలో క్రైస్తవులు స్త్రీల హక్కుల్ని ఎలా అణచి వేశారో [[డా.జయగోపాల్]] గారు చెప్పినప్పుడు నేను క్రైస్తవ మతం పైన కూడా ద్వేషం పెంచుకున్నాను. బైబిల్ లో స్త్రీల గురించి ఎంత నీచంగా వ్రాసుందో కూడా చదివాను. ప్రపంచంలో అన్ని మతాలు భూస్వామ్య మూలాల నుంచి పుట్టిన మతాలే. మీరు పుట్టింది పెట్టుబడిదారి సమాజంలో. మీరు నమ్మేది మాత్రం బురఖా, తెల్ల చీర లాంటి భూస్వామ్య సంప్రదాయాల్ని ప్రోత్సహించే మతాల్ని. హిందూ, ఇస్లాం, క్రస్తవ మతాలు పుట్టిన రోజుల్లో పెట్టుబడిదారి వ్యవస్థ గానీ సోషలిస్టు రాజ్యాలు గానీ లేవు. కేవలం భూస్వామ్య రాజ్యాలు మాత్రమే ఉండేవి. భూస్వామ్య సంస్కృతి అనేది పెట్టుబడిదారి సంస్కృతిలో ఇమడడం కష్టం. సోషలిజంలో ఆ సంస్కృతి అస్సలు ఇమడదు. నేను పెట్టుబడిదారి సంస్కృతి గురించి చదివిన తరువాత భూస్వామ్య సంస్కృతిని పూర్తిగా వదిలిపెట్టాను. మార్క్సిజం చదివిన తరువాత ఆ రెండు సంస్కృతులనీ తిరస్కరించాను. ఒకే వోరలో దూరని రెండు మూడు కత్తులని పట్టుకున్నట్టు నేను ఇంకా ఆ సంస్కృతులని పట్టుకోవడం లేదు.
Return to the user page of "Nrahamthulla/పాత చర్చ 1".