వికీపీడియా చర్చ:ఏకవచన ప్రయోగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
::: జయగోపాల్ గారు ఆ పేజీ చదివితే చెడుగా భావించరనే నేను అనుకొంటాను. వ్యక్తిగత సంభాషణ వేరు. విజ్ఞానసర్వస్వం వ్యాసం వేరు. నేను పైన వ్రాసిన చర్చ కూడా ఒకమారు చూడగలరు. ఏకవచనం మొదట్లో నాకు ఇబ్బంది అనిపించింది కాని అలవాటయినాక ఏకవచనమే సరైనది అనిపిస్తుంది. ఇది తేలికగా తేలే విషయం కాదు. ఇందుకు ప్రమాణాలు లేవు. ఈ విషయంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు గనుక ఇతరులు వ్రాసినవాటిని మార్చడంలేదు. కాని నేను పరిశీలించిందేమంటే "గారు" తొ మొదలై "శ్రీ .. గారు" నుండి "మాన్యశ్రీ శ్రీ శ్రీ .. జీ .. గారు" వరకూ ఈ గౌరవార్ధాలు సాగుతాయి. "మేడమ్ శ్రీ సోనియాజీ" అని కాంగ్రెసు నాయకులు సంబోధించడం ఎన్నిసార్లు చూడడంలేదు? ఏకవచనం పుట్టినప్పుడు పెట్టిన పేరు. గౌరవార్ధ తోకలు తరువాత తగిలించినవి. విజ్ఞాన సర్వస్వంలో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండడమే మెరుగు. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 08:13, 13 డిసెంబర్ 2008 (UTC)
 
:: నా దగ్గర పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ని నేను మీరు అని పిలుస్తుంటాను. ఆమె నా కంటే వయసులో చిన్నదో పెద్దదో నాకు తెలియదు. వయసు, హోదా లాంటి వాటితో పని లేకుండా అందరితో మంచిగా మాట్లాడుతుంటాను. చివరికి ఆటో డ్రైవర్ ని కూడా మీరు అని అంటుంటాను. నా వయసు 26 ఏళ్ళు. జయగోపాల్ గారి వయసు 70 ఏళ్ళకి పైనే. ఇంటర్నెట్ తెలిసిన వాడు మినిమమ్ టెంత్ క్లాస్ కుర్రాడైనా అయ్యుంటాడు. ఆ వయసులో ఉన్నవాళ్ళు 70 ఏళ్ళ వయసు వాళ్ళ పైన ఏకవచనం ప్రయోగించే పరిస్థితి ఉండకూడదు.
 
==తెలుగు వ్యాకరణం==
Return to the project page "ఏకవచన ప్రయోగం".