సంతకము: కూర్పుల మధ్య తేడాలు

Image of John Hancock signature changed to that of మహాత్మా గాంధీ
పంక్తి 16:
 
 
ప్రసిద్ధులైన వ్యక్తుల సంతకాలు [[ఆటోగ్రాఫ్]]‌లుగా సేకరిస్తారు. ఇది ఒక డాక్యుమెంట్ నిర్ధారణకు కాకుండా ఒక జ్ఞాపికగా భావిస్తారు.
 
 
==ఆధునిక సాంకేతికత ==
వ్యక్తుల సంతకాలను యాంత్రికంగా "ముద్రించే" పరికరాలను [[:en:autopen|ఆటోపెన్‌లు]] అంటారు. చాలా ఎక్కువ సంఖ్యలో సంతకాలు చేసే అవసరాలున్న ప్రముఖులు - ఉదా: సినీతారలు, సెలబ్రిటీలు, దేశాధినేతలు, కంపెనీ ప్రధానాధికారులు - ఇలాంటి పరికరాలను వాడుతారు. అమెరికాలో కాంగ్రెస్ ప్రతినిధులు తమ సంతకాలను [[ట్రూ టైప్ ఫాంటు]] ([[:en:True Type Font|True Type Font]])లుగా రూపొందించుకొంటున్నారు. అనేక పత్రాలలో సంతకాలను ముద్రించడానికి ఇది అనువుగా ఉంటుంది.
 
 
పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఇంత సాధారణమైన "సంతకం" అనే భావన కొన్ని భాషలకు చెందిన వ్యవహారాలలో చలామణి కావడంలేదు. అంటే ఒక డాక్యుమెంటుపై పేరు వ్రాయడం అంటే "వ్యక్తిగతమైన పూచీతో సంతకం పెట్టడం" అన్న విశేషమైన ప్రాధాన్యత వారు ఇవ్వరు. వారి పద్ధతిలో డాక్యుమెంటు క్రింద పేరు వ్రాయడం అంటే మిగిలిన వ్రాతలో ఒక భాగమే. [[:en:Chinese language|చైనా భాష]], [[:en:Japanese language|జపాన్ భాష]], [[:en:Korean language|కొరియా భాష]] ఈ కోవలోకి వస్తాయి. వారి పద్ధతిలో పేరుకు చెందిన ఒక [[ముద్ర]] ([[:en:seal (device)|seal]]) వాడుతారు. జపాన్ భాషలో సంతకం సూచించడం కోసం మామూలు లిపికి బదులుగా ''tensho'' లిపి వాడుతారు.
 
 
ఎలక్ట్రానిక్ యుగంలో సంతకాన్ని సూచించడానికి క్రొత్త విధానాలు రూపు దిద్దుకొంటున్నాయి. [[ఇ-మెయిల్]], [[చర్చ సమూహం]] వంట వాటిలో ఒక వ్యక్తి సంతకాన్ని సూచించడానికి ప్రత్యేకమైన క్యారెక్టర్లు, బొమ్మలు, పదాలు, మాటలు, వాక్యాలు వంటివి వాడడం జరుగుతున్నది. వీటిలో కొన్నింటిని [[:en:ASCII art|ASCII art]] అని అంటారు. ఇవే కాకుండా క్రొత్త సాంకేతికతలో [[ఎలక్ట్రానిక్ సంతకం|ఎలక్ట్రానిక్ సంతకాలు]] ([[:en:electronic signature|electronic signature]]s), [[డిజిటల్ సంతకం|డిజిటల్ సంతకాలు]] ([[:en:digital signature|digital signature]]s) వాడుతున్నారు. ఇవి మామూలుగా కంటికి కనిపించవు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సంతకము" నుండి వెలికితీశారు