జ్వాలాముఖి (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

వర్గాలు చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వర్గీకరణ}}
'''జ్వాలాముఖి''' ప్రముఖ రచయిత, కవి, [[నాస్తికుడు]] భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. [[మెదక్‌]] జిల్లా [[ఆకారం]] గ్రామంలో [[1938]] [[ఏప్రిల్ 12]] న జన్మించిన ఆయన అసలు పేరు '''వీరవెల్లి రాఘవాచార్య'''. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. [[14 డిసెంబరు]] [[2008]] న కాలేయ వ్యాధి, గుండెపోటుతో మరణించారు. తెలుగు సాహితీ ప్రపంచంలో [[దిగంబర కవులు]]గా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకరు. [[విరసం]] సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను 'దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు' పేరుతో హిందీ నుంచి అనువదించారు. హైదరాబాద్‌లోని మల్లేపల్లి, నిజాం కళాశాలలో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్‌.బీ. పూర్తిచేశారు. ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించారు. తరువాత హైదరాబాద్‌లోని ఎల్.ఎన్‌.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశారు. మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపారు. 1958లో 'మనిషి' దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు కరుణశ్రీ చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు రాశారు. ఓ.పీ.డీ.ఆర్. సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు [[చైనా]]కు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా పీడీ యాక్ట్ కింద నిఖిలేశ్వర్, చెరబండరాజులతో ముషీరాబాద్ జైల్లో యాభై రోజులున్నారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు. ఈయన పై [[మఖ్దూం మొహియుద్దీన్]] ప్రభావం ఉంది.
 
Line 15 ⟶ 14:
*http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/dec/14main20
 
[[వర్గం:విప్లవ రచయితలు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:నాస్తికులు]]
"https://te.wikipedia.org/wiki/జ్వాలాముఖి_(రచయిత)" నుండి వెలికితీశారు