శివసాగర్ (కవి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==విప్లవ జీవితం==
ఇతను 1968లో నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. ఆ సమయం నుంచే ఇతను శివ సాగర్ అనే కలం పేరుతో కవితలు వ్రాయడం మొదలు పెట్టాడు. ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో అతను ఒక కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదల అయిన తరువాత సి.పి.ఐ. (ఎం. ఎల్) పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరాడు. ఇతను పీపుల్స్ వార్ గ్రూప్ లో పని చేస్తున్న సమయంలో పార్టీ నాయకులకి, ఇతనికి మధ్య విభేదాలు వచ్చి ఇతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలోని అగ్రకులాల నాయకులు దళితుడైన సత్యమూర్తి పార్టీలో ఎదగనివ్వలేదన్న అభిప్రాయం దళితవర్గాలలో ఉన్నది.<ref>http://www.dalitvoice.org/Templates/may_a2006/editorial.htm</ref><ref>http://www.hindu.com/2008/10/20/stories/2008102054790600.htm</ref> ఉద్యమం నుంచి బయటకి వచ్చిన తరువాత కూడా ఇతను కవితలు వ్రాయడం కొనసాగించారు. ఇతను మార్క్సిస్ట్ గతితార్కిక భౌతికవాదాన్ని బలంగా నమ్ముతూ కృశ్చేవ్, బ్రెజ్ఞేవ్, డెంగ్ సియావోపింగ్ లాంటి రివిజనిస్ట్ నాయకుల్ని తీవ్రంగా విమర్శించే కవితలు కూడా వ్రాశాడు. పీపుల్స్ వార్ గ్రూప్ నుండి వెలివేయబడిన సత్యమూర్తి సి.పి.ఐ. (ఎం. ఎల్) ప్రజా ప్రతిఘటన (పి.పి.జి) లో చేరి ఆ బృందం యొక్క లక్ష్యాన్ని వర్గ పోరాటం నుండి కుల పోరాటం వైపు మరలించాడు. దీనితో ప్రజాప్రతిఘటన బృందంలో చాలామంది ఉద్యమకారులు విప్లవ కార్యక్రమాలకు స్వస్తి చెప్పి ప్రధానస్రవంతిలో కలిసిపోయారు.<ref>http://www.thehindu.com/thehindu/2000/11/21/stories/0421403e.htm</ref>
 
==వివాహ జీవితం==
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_(కవి)" నుండి వెలికితీశారు