ప్రజానాట్యమండలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 1:
[[దస్త్రం:Garikapati Rajarao.JPG|alt=Dr.Garikapati Rajarao, Praja Natya Mandali |thumb|ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు డా గరికపాటి.!
[రాజారావు]]
సామ్య సిధ్దాంతాల పునాదితో దైనందిన జీవితంలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో '''ప్రజానాట్యమండలి''' స్ధాపించబడింది. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బావుటా ఎగురవేసింది ప్రజానాట్యమండలి. ఇప్పిటికీ వీధి నాటకాలతో తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంది. 1943లో స్థాపించబడింది
 
70 ఏళ్ళ ఘన చరిత్ర కలిగిన ప్రజా సాంస్కృతికోద్యమ సంస్థగా, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇండియన్ పీపుల్స్ థియేటర్ ( ఇష్టా) కు వారసురాలిగా ఏర్పడిన ప్రజానాట్యమండలి కళ కళ కోసం కాదు, కళ ప్రజలకోసం అని నినదించి తెలుగునాట ప్రజా సాంస్కృతికోద్యమ సారధిగా ప్రజానాట్యమండలి పనిచేస్తోంది. ప్రజా ఉద్యమాల పట్ల అంకితభావంతో తన కలాన్ని, గళాన్ని అంకితమిస్తూ ఉద్యమిస్తోంది. తెలుగునేలపై సాక్షరతా ఉద్యమ పిలుపునందుకుని అక్షర కళాయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. తెలుగు భాషా, సాంస్కృతికోద్యమానికి బాసటగా నిలిచి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పేరుతో కళారూపాలను ప్రదర్శించింది. సారా వ్యతిరేక ఉద్యమం, మద్యంపై యుద్ధం పేరుతో వేలాది కళా ప్రదర్శనలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసింది. శ్రీశ్రీ, గురజాడ, వేమన, కందుకూరి, జాషువా, వీరబ్రహ్మం వంటి సంఘ సంస్కర్తల భావజాలాన్ని, వారి రచనల సందేశాన్ని కళారూపాలుగా మలచి పల్లెల్లో, పట్టణాల్లో వాడవాడలా విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది. జిల్లాలో అల్లూరి సీతారామరాజు పోరాట చరిత్రను వీధినాటికగా మలచి వందలాది ప్రదర్శనలిచ్చింది ప్రజానాట్యమండలి. దళిత, ఆదివాసుల హక్కుల రక్షణ కోసం, ఎసిసి,ఎస్.టి సబ్ ప్లాన్ చట్టం ప్రచార జాతాలు వందలాది మంది కళాకారులతో జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది.
 
 
2022 మే 28,29,30 వ తేదీలలో కృష్ణా జిల్లాలోని పెనమలూరు లో ప్రజానాట్యమండలి రాష్ట్ర 10 వ మహాసభలు జరిగాయి.ఈ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు గా పి. మంగరాజు, ఎస్.అనిల్ కుమార్ లు ఎన్నికయ్యారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు గా sk. ఖాసిం, ఈ.నాగరాజు లు సహాయ కార్యదర్శులుగా ఐ.వి, సుభాషిణి,గుర్రం రమణ లు ఎన్నికయ్యారు.45 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నికయ్యింది.
"https://te.wikipedia.org/wiki/ప్రజానాట్యమండలి" నుండి వెలికితీశారు