యునానీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sl:Unani
{{వైద్య శాస్త్రం}}
పంక్తి 1:
{{వైద్య శాస్త్రం}}
'''యునానీ''' (Unani) అన్న మాట "అయోనియా" అన్న [[గ్రీకు]] మాట లోంచి వచ్చింది. అయోనియా గ్రీకు దేశానికి మరొక పేరు. యునానీ వైద్యం గ్రీకు దేశంలో రెండవ శతాబ్దంలో పుట్టింది. కాని దీని ప్రచారంలోకి తీసుకు వచ్చినది తొమ్మిదవ శతాబ్దపు పారశీక వైద్యుడు [[ఇబ్న్ సీనా|హకీమ్ బిన్ సేనా]] (అవిసెన్నా). [[హకీం]] అంటేనే [[వైద్యుడు]]. ప్రస్తుతం ఇది గ్రీకు దేశం లోనూ కాదు, పారశీక దేశం లోనూ కాదు కానీ [[భారతదేశం]] లో బహుళ ప్రచారంలో ఉంది.
గ్రీస్ దేశాన్ని సెంట్రల్ ఆసియా లోని ఇతర ప్రాంతాలన్ని 'యునాన్' అని పిలిచేవి. ఈ వైద్య ప్రక్రియ గ్రీస్ లో మొదలైంది కాబట్టి దీన్ని యునాని వైద్యం అనేవాళ్ళు. మాయలూ, మంత్రాల నుండి వైద్యాన్ని వేరు చేసి ఒక శాస్త్రంగా చెప్పిన 'హిప్పొక్రెటస్'(క్రీ.పూ377-460) ఈ యునాని వైద్య ప్రక్రియకు పితామహుడు. ఈ వైద్య ప్రక్రియను [[ఈజిప్టు]], [[సిరియా]], [[ఇరాక్]], [[పర్షియా]], [[భారత్]], [[చైనా]] దేశాల్లోని మేధావులు తమ ప్రక్రియలు జోడించి మరింత సుసంపన్నం చేసాక, అరబ్బులు ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేసారు. అందువల్ల దీన్ని గ్రీకో-అరబ్ మెడిసిన్ అంటారు. ఈవైద్య ప్రక్రియ భారత్ కు వచ్చాక ఇక్కడి రాజవంశస్తులు అయిన ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొఘల్ చక్రవర్తులూ ఆదరించారు. రాజ వంశాల ఆదరణ తో 17 వ శతాబ్దం వరకూ యునానీ వైద్యం అభివృద్ధి చెందినా, బ్రిటిష్ వారి పాలన లో దీనికి పూర్తిగా ఆదరణ తక్కువయింది.
"https://te.wikipedia.org/wiki/యునానీ" నుండి వెలికితీశారు