వైవస్వత మనువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ కొంచెంగా
పంక్తి 1:
[[హిందూమతము|హిందువుల]] [[పురాణములు|పురాణాల]] ప్రకారం ఒక '''[[మనువు]]''' యొక్క పాలనా కాలాన్ని '''[[మన్వంతరము]]''' అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఒక [[బ్రహ్మ]] దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము" నడుస్తున్నదని, ఈ మన్వతంతరానికి అధిపతి '''వైవస్వత మనువు''' అని పురాణాల కధనం. [[భాగవతం]] [[అష్టమ స్కంధం]]లో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది.
{{మొలక}}
 
'''వైవశ్వత మనువు'''కు [[ఇక్ష్వాకుడు]], [[శిబి]], నాభాగుడు, దృష్టుడు, [[శర్యాతి]], నరిష్యంతుడు, నభగుడు, కరూషుడు, ప్రియవ్రతుడు అని తొమ్మిది మంది పుత్రులు కలిగారు.
 
ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
 
 
చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు. తరువాత వైవస్వత మన్వంతరం మొదలయ్యింది. వైవస్వత మనువు వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది. ఈ మనువుకు తొమ్మండుగురు పుత్రులు - [[ఇక్ష్వాకుడు]], [[శిబి]], నాభాగుడు, దృష్టుడు, [[శర్యాతి]], నరిష్యంతుడు, నభగుడు, కరూషుడు, ప్రియవ్రతుడు. <!-- (ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు) సరి చూడాలి. -->
 
ఈ మన్వంతరంలో భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు [[వామనుడు]]గా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు. ఇంద్రుడు - పురందరుడు. సురలు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
 
 
==ఇవి కూడా చూడండి==
* [[మన్వంతరము]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/వైవస్వత_మనువు" నుండి వెలికితీశారు