పట్నం వచ్చిన పతివ్రతలు: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: పూర్తి
(కథ ప్రారంభం)
ట్యాగు: 2017 source edit
(→‎కథ: పూర్తి)
ట్యాగు: 2017 source edit
 
== కథ ==
చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన మనవళ్ళిద్దరికీ పెంచి పెద్దచేసి పెళ్ళిళ్ళు చేస్తుంది నారాయణమ్మ. ఆమె పెద్ద మనవడు చదువు లేని వాడు. అతనికి చదువుకున్న దేవి అనే అమ్మాయితో పెళ్ళి చేస్తుంది. అగ్రికల్చరల్ బిఎస్సీ చదివిన రెండో మనవడికి పల్లెటూరు అమ్మాయి లలితాంబనిచ్చి పెళ్ళి చేస్తుంది. ఇద్దరూ కలిసి పట్నానికి కాపురం మార్చేద్దామని భర్తల్ని సతాయిస్తుంటారు. కానీ వాళ్ళు మాత్రం చిన్నప్పటి నుంచి తమను కష్టపడి పెంచిన బామ్మను వదలడం ఇష్టం లేక పల్లెటూర్లోనే ఉండాలనుకుంటారు.
ఒక రోజు దేవి, లలితాంబలు కలిసి భర్తలకు చెప్పకుండా పట్టణానికి పారిపోతారు. అక్కడ ఉన్న తమ స్నేహితురాలు శకుంతలను కలుసుకోవాలని వాళ్ళ ఆలోచన. అయితే ఆమె ఇల్లు వాళ్ళిద్దరూ కనుక్కోలేకపోతారు. వీధుల్లో దిక్కు తోచక తిరుగుతుంటే వీళ్ళిద్దరినీ ఒకామె గంగాదేవి అనే బ్రోతల్ మహిళకు అమ్మడానికి ప్రయత్నిస్తుంది. అయితే బేరం కుదరక పోవడంతో ఆమె వాళ్ళను తన దగ్గరే ఉండనిస్తుంది. గంగాదేవికి కోపం వచ్చి తన దగ్గరున్న గూండాలను పంపి వారిద్దరినీ తీసుకురమ్మంటుంది. గూండాలు వాళ్ళను తరుముకు వస్తుంటే వారు తెలియకుండా గంగాదేవి ఇంటికే రక్షణ కోసం వెళ్ళి బంధీలవుతారు. భర్తలిద్దరూ తమ భార్యలను వెతుక్కుంటూ పట్నానికి వచ్చి వారిని రక్షిస్తారు.
 
== తారాగణం ==
33,857

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3657740" నుండి వెలికితీశారు