ఖలిస్తాన్ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఖలిస్తాన్ ఉద్యమం [[పంజాబ్]] లో కొనసాగిన సిక్కు మత ఉద్యమం. పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ మంది సిక్కు మతస్తులయినప్పటికీ పంజాబ్ లో సిక్కులు హిందువుల కంటే ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల సిక్కులు పరాయీకరణకి లోనయ్యారు. పంజాబ్ లో హరిత విప్లవం తరువాత కూడా హిందువుల పట్టణాలలో లాభదాయకమైన వ్యాపారాలు చేస్తూ సామాజికంగా ఉన్నత వర్గీయులుగా కొనసాగారు, సిక్కులు ఎక్కువగా పల్లె ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ ఉండిపోయారు. పంజాబ్ లో పోలీసులు, సైనికులు మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడడం వల్ల కూడా అనేక మంది సిక్కులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ ఉద్యమంలో చేరారు. సంస్కృతిక విషయాలలో కూడా సిక్కులకి, హిందువులకి మధ్య తేడా ఉంది. సిక్కు గురువులు తమ మతం హిందూ మతం తరహా ధార్మికతని అనుసరిస్తుందని చెప్పుకున్నారు కానీ హిందూ మతానికి, సిక్కు మతానికి మధ్య నిర్మాణ సంబంధిత తేడాలు చాలా ఉన్నాయి. సిక్కులు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు)ని నమ్ముతారు. వీరు [[విగ్రహారాధన]]కి వ్యతిరేకం. హిందువులు మూడు కోట్ల దేవతలని నమ్ముతూ విగ్రహారాధన చేస్తారు. సిక్కు మతంలో స్వర్గనరకాలు కూడా ఉండవు. మెజారిటీ హిందువుల చేతిలో ఉన్న భారత ప్రభుత్వం సిక్కు సంస్కృతిని అణగ తొక్కడం వల్ల కూడా సిక్కులు వేర్పాటువాద ఉద్యమాన్ని లేవనెత్తారు.
 
పంజాబీ భాషలో ఖల్సా అంటే పవిత్రమైన అని అర్థం. ఖలిస్తాన్ అంటే పవిత్రభూమి. ఒకప్పుడు పంజాబ్ లో సిక్కుల జనాభా కంటే హిందువుల జనాభా ఎక్కువగా ఉండేది. ఒక్క లూధియానా జిల్లాలో మాత్రమే అతి ఎక్కువగా 41.6% మంది సిక్కులు ఉండేవారు.[http://paa2004.princeton.edu/download.asp?submissionId=41274] పాకిస్తాన్ ను భారత్ నుంచి విభజించడాన్ని హిందువులతో పాటు సిక్కులు కూడా వ్యతిరేకించారు. దేశ విభజన తరువాత పాకిస్తాన్ నుంచి అనేక మంది సిక్కులు హిందువులతో పాటు భారత్ కు వలస వచ్చారు. వారు ఎక్కువగా దేశంలోని వాయువ్య ప్రాంతాలలోనే స్థిరపడ్డారు. అందుకే తూర్పు పంజాబ్ లో సిక్కుల జనాభా పెరిగింది. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం సిక్కుల్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల సిక్కులలో కూడా వేర్పాటువాద ధోరణులు ఏర్పడ్డాయి. ఈ ధోరణులు ఉగ్రవాదాన్ని తలపింప చేసేంత దాకా పైకి ఎగిసాయి.
"https://te.wikipedia.org/wiki/ఖలిస్తాన్_ఉద్యమం" నుండి వెలికితీశారు