డైమండ్ రత్నబాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
== జననం ==
రత్నబాబు 1982, సెప్టెంబరు 19న [[ఆంధ్రప్రదేశ్]], [[కృష్ణా జిల్లా]]<nowiki/>లోని [[మచిలీపట్నం]]<nowiki/>లో జన్మించాడు. డిగ్రీ పూర్తిచేశాడు.
 
చిన్నప్నటినుండి సాహిత్యంలో ప్రవేశం ఉన్న రత్నబాబు రాసిన కవిత్వాన్ని విన్నవాళ్ళు 'కుర్రాడు డైమండ్ లా ఉన్నాడు, చాలా బాగా రాశాడు' అని అన్నారు. ఆ మాట తనకు నచ్చి, డైమండ్ అనే పదాన్ని తన కలంపేరుగా పెట్టుకున్నాడు. అలా అందరూ డైమండ్ రత్నబాబు అని పిలుస్తున్నారు.
 
== సినిమారంగం ==
నటుడు [[అల్లు రామలింగయ్య]] గురించి రత్నబాబు రాసిన వ్యాసం ఒక పత్రికలో ప్రచురితమయింది. దానికి వచ్చిన 250 రూపాయల చెక్కు తీసుకోవడానికి [[హైదరాబాదు]]<nowiki/>కి వెళ్ళాడు. ఇతని రచనల గురించి తెలుసుకున్న [[అల్లు అరవింద్]], [[అల్లు అర్జున్]] లు సినిమారంగంలో ప్రోత్సాహం అందించారు. సినిమా రచయిత [[చింతపల్లి రమణ]] దగ్గర కొన్ని సినిమాలకు పనిచేశాడు.
 
2015లో వచ్చిన [[షేర్ (సినిమా)|షేర్]] సినిమాతో రచయితగా సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత [[లక్కున్నోడు]] (2017), [[గాయత్రి (సినిమా)|గాయత్రి]] (2018) మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.<ref>{{Cite web|title=Diamond Ratna Babu - Movies, Biography, News, Age & Photos|url=https://in.bookmyshow.com/person/diamond-ratna-babu/in.bookmyshow.com/person/diamond-ratna%20babu/1060269|access-date=2022-04-14|website=BookMyShow|language=en-IN}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/డైమండ్_రత్నబాబు" నుండి వెలికితీశారు