జ్వాలాముఖి (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
*'రాంగేయ రాఘవ' జీవిత చరిత్ర హిందీ నుంచి తెలుగు అనువాదం
 
== జ్వాలాముఖి గురించి నిఖిలేశ్వర్ ==
కాలేజీలో జరిగే డిబేటింగ్ లో విద్యార్థుల మధ్య వాగ్వివాదాలలో జ్వాలాముఖి ఆవేశంగా మాట్లాడేవాడు. నేనేమో తడబడుతూ గందరగోళపడిపోయేవాణ్ణి!
1960లలో జ్వాల ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకే సైకిల్‌పై బయలుదేరి మల్లేపల్లిలోని సీతారామ్ దేవాలయం నుంచి దాదాపు పదిహేను మైళ్లు ప్రయాణం చేసి సెంటర్‌కు చెమటలు కక్కుతూ ఎనిమిది గంటలకల్లా మారేడ్‌పల్లిలోని ఏ.వో.సి స్కూల్ కు చేరేవాడు.నేనేమో ముషీరాబాద్ నుంచి సైకిల్ తొక్కుతూ రోజు 10 మైళ్లు అదే అవస్థలో ఉద్యోగానికి హాజర్!
నా ప్రేమ వివాహం 1963లో! కులాంతర వివాహం, పైగా అమ్మాయి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది.. ఇక ఆ రహస్య వివాహానికి జ్వాలాముఖి అన్నివిధాలా తోడ్పడి యాకుత్‌పురాలోని ఆర్యసమాజ్ మందిర్‌లో వివాహం జరిగించాడు. విజయవాడ దాకా తోడు వచ్చి నన్ను-యామినిని బెంగుళూర్ హానిమూన్‌కు పంపించేసాడు.
ఆ తర్వాత మా కుటుంబాల ఆత్మీయ సంబంధాలు ఎంతో ఆప్యాయంగా సాగిపోయిన దశలోనే మా పిల్లల కులాంతర వివాహాలకు ఆయన నిర్వాహకుడు. ఆయన పిల్లల కులాంతర- మతాంతర వివాహాలకు నేను నిర్వాహకుడిగా..!
మమ్మల్ని కాలేజీ ఉపన్యాసాలకు పిలిస్తే బాంబులతో వస్తారని ఆర్ఎస్ఎస్ అనుయాయులు (ఎబివిపి) కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసారు. అప్పుడు జ్వాల ప్రిన్సిపాల్ సమక్షంలోనే తనదైన శైలిలో ప్రసంగిస్తూ జేబుల్లోంచి కవితలు తీస్తూ, మేము బాంబులతో వస్తే పరిణామాలు మరో విధంగా వుండేవని చమత్కరించాడు.
సభలు-సమావేశాలు- ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు. 1971లో వచ్చిన 'ఓటమి తిరుగుబాటు' తర్వాత మళ్లీ మరో సంపుటిని ప్రచురించలేదు. 'వేలాడిన మందారం' నవల, హైదరాబాద్ కథలు వున్నాయి. ఆయన నిశిత వివేచనతో రాసిన సాహిత్య వ్యాసాలు సంపుటిగా రావలసి వుంది.స్నేహశీలీ, ఆర్ద్ర హృదయుడు, భోజన ప్రియుడు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిస్పందించిన సాహితీవేత్త.
సభలు - సమావేశాలు - ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు.
==ఉత్ప్రేరక జ్వాలాముఖి కి అక్షర నివాళులు==
 
"https://te.wikipedia.org/wiki/జ్వాలాముఖి_(రచయిత)" నుండి వెలికితీశారు