పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==పొదుపు వైపరీత్యం==
సాధారణంగా పొదుపు ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. పొదుపు వలన పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి పెరగడం వలన పరిశ్రమలు అధికంగా స్థాపించబడి కార్మికులను ఉపాధి అవకాశాలు అధికమౌతాయి. కాని ఇవి నాణేనికి ఒకవైపు మాత్రమే. స్వల్పకాలంలో పొదుపు లాభకరమైనప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే అర్థిక వ్యవస్థకు పొదుపు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. దీర్ఘకామలోదీర్ఘకాలంలో అధిక పొదుపు వలన వస్తుసేవల యొక్క డిమాండు పడిపోయి సంస్థలు ఉత్పత్తి తగ్గించే దశ రావచ్చు. అదే జరిగితే పరిశ్రమలలో కార్మికుల సంఖ్య తగ్గి నిరుద్యోగాలు పెరగవచ్చు. స్థూలంగా ఆర్థిక వ్యవస్థ సంక్ష్యోభంలోకి కూరుకుపోతుంది. దీన్నేఆర్థికవేత్తలు పొదుపు వైపరీత్యంగా పిలుస్తారు.
 
దీన్ని మరోరకంగా చెప్పవచ్చు. ఒకరి ఖర్చు మరొకరి ఆదాయం. ఒక వ్యక్తి పొదుపు చేస్తునాడంటే వినిమయం ఆ మేరకు తగ్గించినట్లే. వినిమయం తగ్గడం వలన ఇతరుల ఆదాయం కూడా తగ్గినట్లు. కాబట్టి పొదుపు అనేది ఒక వ్యక్తి దృష్ట్యా చూస్తే ప్రయోజనకరమేమో కాని ఆర్థిక వ్యవస్థ మొత్తం దృష్ట్యా చూస్తే నష్టమే అధికం. అంతేకాకుండా ఒక వ్యక్తి ఖర్చు ఇతరులకు ఎన్నో రెట్ల ఆదాయాన్ని కల్పిస్తుంది. ఆర్థిక పరిభాషలో దీన్నిఇది వినిమయ గుణకంగా పిలువబడుతుంది. ఉదాహరణకు A వ్యక్తి ఖర్చు B వ్యక్తికి ఆదాయం, B తనకు ఆదాయంగా లభించిన మొత్తంలో నుంచి ఖర్చు చేస్తే C వ్యక్తికి ఆదాయంగా లభిస్తుంది. ఇలా వినిమయం చేసిన డబ్బు గుణకం రూపంలో అనేకులకు ఆదాయంగా వస్తుంది. పొదుపు చేయడం వలన ఆ మేరకు డబ్బు ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడదు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పొదుపు" నుండి వెలికితీశారు