"ఎ.జి.కృష్ణమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

కొంత విస్తరణ
(కొంత విస్తరణ)
[[ముద్రా కమ్యూనికేషన్స్]] (Mudra Communications) సంస్థాపక అద్యక్షుడుఅధ్యక్షుడు ఎ. జి. కృష్ణమూర్తి (A. G. Krishanamurthy) రూ. 35 వేల నగదు తోను ఒకే ఒక క్లయింట్‌ తోను వ్యాపార ప్రకటనా సంస్థ (advertising agency) స్థాపించేరు. కేవలం తొమ్మిదేళ్ళల్లో ముద్రా [[భారతదేశం]]లో ఉన్న పెద్ద వ్యాపార ప్రకటనా సంస్థలలో మూడవ స్థానాన్ని, స్వదేశీ వ్యాపార ప్రకటనా సంస్థలలో ప్రధమ స్థానాన్ని చేరుకుంది. ప్రభుత్వంలో చిన్న గుమస్థా ఉద్యోగంతో ప్రారంభించిన ఎ. జి. కె. తెలుగువారు గర్వించదగ్గ అతి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. [[ధీరూభాయ్ అంబానీ]]కి అతి చేరువలో ఉండి ఈ సంస్థని ఇంత త్వరగా ఉన్నత స్థాయికి లేవనెత్తి ఆయనచేత శభాష్ అనిపించుకున్నారు. ఈయన అనుభవాలని పుస్తకాల రూపంలోనూ, పత్రికా శీర్షికల ద్వారానూ రాసి యువతని ఉత్తేజ పరుస్తున్నారు. కృష్ణమూర్తి తెలుగు పత్రికలో వారం వారం అనే శీర్షికను, ఆంగ్ల పత్రికలలో ఏజికె స్పీక్ (AGK Speak) అనే శీర్షికను వ్రాస్తుంటాడు.
 
కృష్ణమూర్తి [[1942]], [[ఏప్రిల్ 28]]న [[గుంటూరు]] జిల్లా [[వినుకొండ]]లో జన్మించాడు.<ref>http://www.agkonline.com/home_agk.htm</ref> [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి చరిత్రలో బి.ఏ హానర్స్ పట్టాపుచ్చుకొని 1968లో 60, 70వ దశకాలలో వస్త్ర పరిశ్రమలో బాగా పేరున్న కాలికో మిల్స్లో గిరాబెన్ సారాభాయికి సహాయకుడిగా చేరాడు. 1972లో అదే కంపెనీకి చెందిన వ్యాపార ప్రకటనాసంస్థ అయిన శిల్పా అడ్వర్టైజింగ్ లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా పదవోన్నతి పొందాడు. 1976లో రిలయన్స్ సంస్థలకు ఆడ్వర్టైజింగ్ మేనేజరుగా చేరి, నాలుగు సంవత్సరాలు తిరక్కుండానే సొంత వ్యాపార ప్రకటనా సంస్థ ముద్రా కమ్యూనికేషన్స్ ను 1980, మార్చి 25న స్థాపించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1942 జననాలు]]
[[వర్గం:తెలుగువారిలో వ్యాపారవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/367470" నుండి వెలికితీశారు