రోనాల్డ్ కోస్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: da:Ronald Coase
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో వర్తక వ్యవహారాల వ్యయం, ఆస్తి హక్కుల ప్రాధాన్యాన్ని విశ్లేషించి [[1991]] సంవత్సరపు అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని పొందిన ప్రముఖ ఆర్థిక వేత్త రోనాల్డ్ కోస్ (Ronald Coase). [[1910]] లో [[ఇంగ్లాండు]] లో జన్మించిన '''రోనాల్డ్ కోస్''' [[లండన్]] స్కూల్ ఆప్ ఎకనామిక్స్, బఫెలో విశ్వవిద్యాలయం, [[వర్జీనియా]] విశ్వవిద్యాలయం లలో అద్యాపకుడిగా పనిచేసినారు. చివరికి [[1964]] లో స్వేచ్చా పారిశ్రామిక ఆర్థిక శాస్త్రానికి పేరెన్నికగన్న [[చికాగో]] విశ్వవిద్యాలయంలో ప్రవేశించి అక్కడే స్థిరపడ్డారు.
==బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి==
[[1910]] [[డిసెంబర్ 29]] న ఇంగ్లాండులోని మిడిల్‌సెక్స్ లో జన్మించిన రోనాల్డ్ కోస్ 1927-29 వరకు లండన్ ఎక్స్‌టర్నల్ ప్రోగ్రాం చేసి 1931 లో లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ పుచ్చుకున్నాడు. 1935-51 వరకు లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ లో అద్యాపకుడిగా చేరిన రోనాల్డ్ కోస్, 1951 లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందినాడు. అదే సంవత్సరం [[అమెరికా]] కు పయనమై బఫెలో విశ్వవిద్యాలయంలో ప్రవేశించి 1958 వరకు అక్కడ అద్యాపకుడిగా పనిచేశాడు. 1958 లో వర్జీనియా విశ్వవిద్యాలయంలో చేరి 1964 వరకు అక్కడే పనిచేసినాడు. చివరికి 1964 లో ప్రఖ్యాత చికాగో విశ్వవిద్యాలయంలో చేరి అక్కడే స్థిరపడినాడు. చికాగో విశ్వవిద్యాలయంలో ఉన్న రోజుల్లోనే Journal of Law and Economics కు ఎడిటర్ గా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/రోనాల్డ్_కోస్" నుండి వెలికితీశారు